Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల‌పై మోడీ న‌జ‌ర్‌.. ఏ క్ష‌ణ‌మైనా..?

By:  Tupaki Desk   |   20 Aug 2022 2:30 AM GMT
వైసీపీ నేత‌ల‌పై మోడీ న‌జ‌ర్‌.. ఏ క్ష‌ణ‌మైనా..?
X
ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీలో వైసీపీ నేత‌ల‌పై కేంద్రం నిఘా పెట్టింద‌నే వార్త‌లు.. ఢిల్లీలో వినిపిస్తున్నాయి. ఏపీ స‌ర్కారు కు చెందిన కొంద‌రు పెద్ద‌లు.. అవినీతి మార్గాల్లో మ‌నీ లాండ‌రింగుకు పాల్ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఏ క్ష‌ణ‌మైనా వారిపై ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ దాడులు చేయొచ్చ‌ని.. ఢిల్లీలోని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. ప్ర‌స్తుతం గుంభ‌నంగా ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారుతుంద‌ని కూడా చెబుతున్నారు. ``ఎప్పుడు ఏమైనా జ‌రగొచ్చు. ఈ విష‌యంలో చాలా గోప్య‌త పాటిస్తున్నారు`` అని ఢిల్లీకి చెందిన ఒక సీనియ‌ర్ నేత చెప్పారు.

వీరిలో లిక్క‌ర్ వ్యాపారంలో ఉన్న ఓ పార్ల‌మెంటు స‌భ్యుడు.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఐదుగురు వ‌ర‌కు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని ప్రాధ‌మికంగా తెలుస్తోంది. అంతేకాదు.. సినిమా రంగంలోని వారిపై కూడా.. ఈడీ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇదంతా కూడా ఏపీలో మారుతున్న రాజ‌కీయాల‌కు పరాకాష్ట‌గా చెబుతున్నారు. ఇప్ప‌టికే.. ఒక ఎంపీ విష‌యంలో కేంద్రం సీరియ‌స్‌గా ఉంద‌ని.. ఢిల్లీ ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్క‌యి.. లిక్క‌ర్ మాఫియాతో చేతులు క‌లిపారంటూ.. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై ఎవ‌రూ స్పందించ‌లేదు.

అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌నే అంశం పై కూడా కేంద్రం దృష్టి పెట్టింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంటులోనూ ఈ త‌ర‌హా వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. తీర ప్రాంతం లో ల‌భించే ఓ ఖ‌నిజాన్ని కొంద‌రు విదేశాల‌కు త‌ర‌లించార‌ని.. టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రంలో జ‌రుగుతున్న కొన్ని విష‌యాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టామ‌ని, త్వ‌ర‌లోనే నిగ్గు తేలుస్తామ‌ని.. వ్యాఖ్యానించింది.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. త్వ‌ర‌లోనే ఏపీపై కేంద్రం ఏదో చేయ‌బోతోంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇంకో వైపు.. రాజ‌కీయంగా కూడా కేంద్రానికి-రాష్ట్రానికి మ‌ధ్య గ్యాప్ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.