Begin typing your search above and press return to search.

కలకలం రేపుతున్న తబ్లీగీ సంస్థలపై ఈడీ తనిఖీలు?

By:  Tupaki Desk   |   20 Aug 2020 4:15 AM GMT
కలకలం రేపుతున్న తబ్లీగీ సంస్థలపై ఈడీ తనిఖీలు?
X
కరోనా కేసులు అప్పుడప్పుడే దేశంలో నమోదవుతున్న వేళ.. తబ్లీగీ జమాతే సంస్థ నిర్వహించిన సదస్సు కారణంగా.. భారీ ఎత్తున కరోనా కేసులు దేశ వ్యాప్తంగా వ్యాపించటం తెలిసిందే. పెనుసంచలనంగా మారిన ఈ ఉదంతంలో తబ్లీగీల ఎపిసోడ్ లేకుంటే.. కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్న మాట ఇప్పటికి వినిపిస్తూ ఉంటుంది. దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్న వేళ.. వేలాదిగా హాజరైన తబ్లీగీల సదస్సుతో.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వ్యాపించిదన్న విమర్శను పలువురు చేస్తుంటారు.

దీనికి తోడు ఢిల్లీలో నిర్వహించిన ఈ సదస్సు నిర్వహణ విషయంలో అధికారుల తీరుతో పాటు.. నిఘా వైఫల్యం భారీగా ఉందన్న మాట పలువురి నోట వినిపించింది. మొత్తంగా తబ్లీగీల వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అనంతర కాలంలో ఆ సంస్థ పేరు వినిపించటం మానేసింది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశ వ్యాప్తంగా తబ్లీగీల కార్యాలయాలపై తనిఖీలు నిర్వహించారు.

ప్రపంచ దేశాల నుంచి తబ్లీగీ జమాత్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయన్న ఆరోపణతో పాటు.. అలా వచ్చిన నిధుల్ని నిబంధనలకు విరుద్దంగా సొంత ఖాతాలకు తరలించిన వైనాన్ని ఈడీ గుర్తించింది. దీంతో.. మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తో పాటు.. మరో నలుగురిపైనా కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ తో పాటు.. హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాలతో పాటు.. హైదరాబాద్ లోని నాలుగు చోట్ల సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ తనిఖీల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. వీటిల్లో ఏమేం అంశాల్ని గుర్తించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.