Begin typing your search above and press return to search.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు!
By: Tupaki Desk | 17 Jun 2022 6:31 AM GMTఅనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పై ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులకు దిగింది. తాడిపత్రిలోని ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ఈడీ తనిఖీల సమయంలో జేసీ సోదరులు.. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డితో సహా కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఈడీ అధికారులు దాడులకు దిగారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రాకుండా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ పోటీకి దూరంగా ఉన్నారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అలాగే తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే అన్నదమ్ములిద్దరూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో చిత్తయ్యారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసింది. ముఖ్యంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులకు అనుమతులు లేవని, పలు నిబంధనలు ఉల్లంఘించారని బస్సులను సీజ్ చేసింది. ఇందుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేయించి ఆయనను జైల్లో కూడా వేసింది.
అలాగే పోలీసులను దూషించారంటూ.. కులం పేరుతో తిట్టారంటూ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. తాజాగా ఈడీ దాడులతో మరోమారు జేసీ ప్రభాకర్ వార్తల్లోకి వచ్చారు.