Begin typing your search above and press return to search.
నిన్న మంత్రి..నేడు టీఆర్ఎస్ ఎంపీ.. తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ, ఈడీ దాడులు
By: Tupaki Desk | 10 Nov 2022 5:56 AM GMTమునుగోడు ఓటమితో రగిలిపోతున్న బీజేపీ తమ చెప్పు చేతుల్లోని ఐటీ, ఈడీలకు పనిచెప్పింది. వెంటనే అధికారులు తెలంగాణపై వాలిపోయి అధికార టీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధులపై పడ్డారు. కరీంనగర్ లో తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఆస్తులపై ఈడీ, ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. అది మరవకముందే హైదరాబాద్ శ్రీనగర్ లోని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కార్యాలయంలో అధికారుల సోదాలు సంచలనమయ్యాయి.
కరీంనగర్, హైదరాబాద్ లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీసులోనూ ఈడీ సోదాలు నిర్వహించారు. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీసులో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్, హైదర్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్ లో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు చేశారు.
కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ మంత్రి, గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదరాబాద్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్లలో తనిఖీలు నిర్వహించారు.
సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటితోపాటు మంకమ్మతోటలోని ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్ తోపాటు మరికొంత మంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు. నిన్న మంత్రి గంగులను టార్గెట్ చేసిన ఐటీ ఈడీలు.. ఈరోజు టీఆర్ఎస్ ఎంపీని టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఖమ్మం జిల్లాలోనై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది.
మునుగోడులో గెలిచిన ఆనందం లేకుండా.. తమను ఓడించిన టీఆర్ఎస్ పై బీజేపీ ఇలా ప్రతీకారం మొదలుపెట్టిందని టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని చెబుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.