Begin typing your search above and press return to search.

టార్గెట్ టీయారెస్ : వెన్నులో చలి పుట్టేలా ఈడీ దాడులు

By:  Tupaki Desk   |   10 Nov 2022 8:30 AM GMT
టార్గెట్ టీయారెస్ : వెన్నులో చలి పుట్టేలా ఈడీ దాడులు
X
ఏ రాజకీయ పార్టీకు అయినా ఆర్ధికంగా బలంగా ఉన్న వారు కావాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్న వారితో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు అంతా కూడా సన్నిహితంగా ఉంటారు. ఇదంతా చాలా రొటీన్ గా సాగిపోయే వ్యవహారం. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఉభయతారకంగా లబ్ది పొందే ఈ రకమైన బంధాలు అనాదిగా రాజకీయాల్లో సాగుతూనే ఉంటాయి.

ఇక ఎన్నికల్లో ఇండైరెక్ట్ గా సహాయం చేస్తూ పవర్ లోకి వచ్చిన తరువాత పనులు చేయించుకునే వారు ఒక ఒక పెద్ద నంబర్ లో ఉంటారు. మరో ఏడాదితో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇపుడు గురి చూసి మరీ టీయారెస్ ఆర్ధిక మూలాల మీద పెద్ద ఎత్తున దెబ్బేసేలా దాడులు సాగుతున్నాయని అనుమానిస్తున్నారు.

ఒక్క మునుగోడు ఉప ఎన్నిక చాలు. డబ్బు లేకపోతే ఏదీ జరగదు అని. అందుకే టీయారెస్ తో అంటకాగుతున్న వారు, ఆ పార్టీలో ఉన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు వెన్నులో చలి పుట్టేలా ఈడీ దాడులు స్టార్ట్ అయిపోయాయి. మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని ఆస్వాదించాకముందే ఈ తరహా దాడులు జరగడంతో ఏకంగా టీయారెస్ అధినాయకత్వానికి గట్టి షాక్ తగిలింది అంటున్నారు.

లేటెస్ట్ గా టీయారెస్ మంత్రి గంగుల కమలాకర్ మీద ఈడీ దాడులు జరగడంతో టీయారెస్ వర్గాలలో కలవరం మొదలైంది. గంగుల కమలాకర్ విదేశాలలో ఉన్నపుడు ఈ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో గంగుల ఆఫీసుతో పాటు హైదరాబాద్, కరీం నగర్లో ఉన్న ఆయన ఇంటి మీద కూడా ఈడీ సోదాలు జరిగాయి. ఇది ఆరంభం మాత్రమే అని కూడా అంటున్నారు.

దీని కంటే ముందు టీయారెస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మీద కూడా ఈడీ దాడులు చేసింది ఏకంగా 28 చోట్ల ఆ దాడులు జరిగాయి. అక్కడ ఉన్న కీలక స్థలాలు, భారీ మొత్తాలను ఈడీ టార్గెట్ చేసి మరి నామాను షేక్ చేసిపారేసింది. ఇలా ఐటీ ఈదీ దాడులతో పారిశ్రామికవేత్త కూడా అయిన నామా కొంత ఇబ్బంది పడ్డారు.

ఇపుడు మంత్రి గంగుల వంతు అయింది. దీనికంటే ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించి ఏకంగా కేసీయార్ కుమార్తె కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ మీద కూడా ఈడీ దాడులు జరిగాయి. ఆ తరువాత కవిత తేరుకుని తమకు అభిషేక్ లావావేవీలతో ఎలాంటి సంబంధం లేదని కవిత గట్టిగా చెప్పుకున్నారు.

ఇవన్నీ చూస్తూంటే ఇపుడు టీయారెస్ లో ఉన్న పారిశ్రామికవెత్తలు, వ్యాపారాలు చేసేవారితో పాటు ఆ పార్టీకి సన్నిహితంగా ఉండే బిగ్ షాట్స్ లో కలవరం చెలరేగుతోంది అని అంతునారు. తమ మీద రానున్న రోజుల్లో ఈడీ దాడులతో పాటు ఐటీ దాడులు జరుగుతాయన్న బెంగ వారికి పట్టుకుంది అని అంటున్నారు.

నిజానికి వ్యాపారాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. వాటిని పర్టిక్యులర్ గా ఎవరూ చూడరు, ఫోకస్ పెట్టరు, ఆ విధంగా కధ సాఫీగా సాగిపోతుంది. కానీ ఇపుడు టీయారెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పొలిటికల్ సీన్ తెలంగాణాలో ఉంది. దాంతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత కమలం దెబ్బ తిన్న బెబ్బులిలా ఉంది.

దాంతో టీయారెస్ మీద పై చేయి సాధించేందుకు ఈడీ ఐటీ వంటి వాటితో దాడులకు తెగబడుతోందని టీయారెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దానికి తోడు ఆ పార్టీతో నాయకులతో అంటకాగిన వారు కూడా బెంబెలేత్తిపోతున్నారు. తమ మీద ఏ టైం లో దాడులు జరుగుతాయో అని వారు వణుకుతున్నారని అంటున్నారు.

ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి మీద ఈడీ దూకుడుగా దాడులు చేయడంతో వ్యవహారం సీరియస్ గానే ఉందని టీయారెస్ వర్గాలు అనుమానిస్తునాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా ముదిరి పాకన పడే పరిస్థితే ఉంటుంది తప్ప ఆగేది లేదని కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏం చేయాలి కౌంటర్ స్ట్రాటజీలు ఏంటి అన్న దాని మీదనే టీయారెస్ మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు.

ఇంకో వైపు ఈడీ తీగ లాగితే చాలా లింకులు దొరికాయని ఇక మీదట డొంక అంతా కదులుతుందని అంటున్నారు. దాంతో ఎవరెవరు ఆ డొన వెనకాల ఉంటారు, వారి గుట్టూ మట్టూ ఏంటి అన్నది కూడా ఇపుడు ఇంటరెస్టింగ్ పాయింట్ గా ఉంది మరి. ఏది ఏమైనా టీయారెస్ మంత్రులకు సన్నిహితులకు నిద్ర లేని రాత్రులను ఈడీ దాడులు మిగిలుస్తున్నాయని అంటున్నారు. మిగిలిన కధ వెండి తెర మీద చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.