Begin typing your search above and press return to search.
మనీలాండరింగ్ కేసు : అహ్మద్ పటేల్ ఇంటికి ఈడీ బృందం !
By: Tupaki Desk | 27 Jun 2020 1:00 PM GMTకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వచ్చారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. స్టెర్లింగ్ బయోటిక్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటీవల అహ్మద్ పటేల్‌కు నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే.. కరోనా నియమ నిబంధనలు, 65 ఏళ్ల వయోభారం కారణంగా విచారణకు హాజరు కాలేనని ఈడీకి సమాధానం ఇచ్చారు.
దీంతో ఈ రోజు ఈడీ బృందం ఆయన నివాసానికే వచ్చి అహ్మద్ పటేల్ స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ .5 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది.. అయితే ఇందులో అవకతవకలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
ఆ సంస్థ వివిధ ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మోసం మొత్తం రూ. 8,100 కోట్లుగా అంచనా వేస్తున్నారు ఈడీ అధికారులు.. ఈ వ్యవహారంలో అహ్మద్ పటేల్ పాత్రపై ఈడీ విచారణ చేపట్టింది. బ్యాంకుల యాజమాన్యాల నుంచి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ.. స్టెర్లింగ్ బయోటిక్ యజమానులైన నితిన్, చేతన్‌ను తిరిగి భారత్ కు రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.