Begin typing your search above and press return to search.

రంగంలోకి ఈడీ: త‌బ్లిగీ జ‌మాత్ చీఫ్‌ కు బిగుస్తున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   17 April 2020 11:50 AM GMT
రంగంలోకి ఈడీ: త‌బ్లిగీ జ‌మాత్ చీఫ్‌ కు బిగుస్తున్న ఉచ్చు
X
ఒక్క ప‌రిణామం సంభ‌వించకుండా ఉండి ఉంటే భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ కాన‌రాకుండాపోయేది. లాక్‌ డౌన్ ఎప్పుడో ఎత్తేసే వారు. భార‌త‌దేశంలో క‌రోనా కేసులు వెలుగులోకి రావ‌డంతోనే వెంట‌నే స్పందించి లాక్‌ డౌన్ విధించుకున్నాం. ఈ స‌మ‌యంలో కేవ‌లం ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదవుతూ దేశ‌వ్యాప్తంగా 500-600 వ‌ర‌కు పాజిటివ్ కేసులు చేరాయి. ఇక అప్ప‌టి నుంచి కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌డుతున్న ప‌రిణామాలు క‌నిపించాయి. ఇంత‌లో దేశంలో ఒక కుదుపు వ‌చ్చింది. అదే ఢిల్లీలో నిజాముద్దీన్ త‌బ్లిగీ జ‌మాత్ ప్రార్థ‌న‌లు.

ఢిల్లీలో జ‌రిగిన ఆ ప్రార్థ‌న‌ల‌కు వేల సంఖ్య‌లో ఆ మ‌తానికి చెందిన ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. అయితే అక్క‌డ క‌రోనా వైర‌స్ బాధితులు ఉన్నారు. సామూహిక ప్రార్థ‌న‌లు చేయ‌డంతో వారి నుంచి చాలామంది క‌రోనా వైర‌స్ సోకింది. ఆ ప్రార్థ‌న‌ల అనంత‌రం అంద‌రూ క్షేమంగా ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ఆ ప్రార్థ‌న‌ల‌కు వ‌చ్చిన వారు దేశ న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన వారు ఉన్నారు. ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిచ్చిన కొన్ని రోజుల‌కు క‌రోనా వైర‌స్ బారిన వారు ప‌డ్డారు. దీంతో ఒక్క‌సారిగా దేశంలో క‌రోనా కేసులు పెరిగాయి. ఒక్కో రాష్ట్రంలో వేల సంఖ్య‌లో కేసులు న‌మోదవ‌డానికి కార‌ణ‌మైంది. అయితే దీనికంత‌టికీ కార‌ణంగా లత‌బ్లిగీ జ‌మాత్ చీఫ్ మౌలానా సాద్‌గా భావిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది.

ఇప్ప‌టికే అత‌డిపై ఎన్నో కేసులు న‌మోదు చేయ‌గా తాజాగా అత‌డిపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది. ఢిల్లీ పోలీసుల ఎఫ్ ఐఆర్ ఆధారంగా చేసుకుని అత‌డితో పాటు మ‌రో ఐదుగురిపై కేసులు న‌మోదు చేశారు. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీల‌కు పాల్ప‌డ్డ‌ట్టు గుర్తించి అత‌డి లావాదేవీల‌పై ద‌ర్యాప్తు చేయ‌నున్నారు. త్వ‌ర‌లో అత‌డికి స‌మ‌న్లు జారీ చేయ‌నున్నారు. క‌రోనా విస్త‌రిస్తున్న వేళ భౌతిక దూరం పాటించ‌కుండా మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌డం అత‌డిపై ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ క‌రోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న క్ర‌మంలో మౌలానా సాద్ ప‌రార‌య్యాడు. ప్ర‌స్తుతం అజ్ఞాతంలో ఉన్నాడ‌ని స‌మాచారం.