Begin typing your search above and press return to search.
కరోనాకు షాకిచ్చే సూరీడు.. ఎడిన్ బరో చెప్పిన సంచలన నిజం
By: Tupaki Desk | 16 April 2021 3:30 PM GMTజియించామని చంకలు గుద్దుకున్న వారికి షాకులు ఇవ్వటమే కాదు.. ప్రభుత్వాలకు లోపించిన ముందుచూపును.. ప్రమాదాన్ని శంకించే లోపాన్ని తెలియజెప్పింది మాయదారి కరోనా. తప్పులు చేసింది పాలకులు అయితే.. అందుకు శిక్షలు అనుభవిస్తున్నది మాత్రం సామాన్యులన్న విషయాన్ని మర్చిపోకూడదు. రోజురోజుకు కేసులు పెరిగిపోవటమే కాదు.. రోజులో 2 లక్షలకు పైగా కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. కరోనా తొలిదశలో రోజుకు లక్ష లోపు కేసులు మాత్రమే నమోదై.. ఆగిపోయింది.
అందుకు భిన్నంగా సెకండ్ వేవ్ తొలిదశలోనే దేశ వ్యాప్తంగా 2 లక్షల కేసులు అంటే.. రానున్న రోజుల్లో మరెన్ని కేసులు నమోదవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చిన తర్వాత వేదన చెందే కంటే.. అది దరి చేరకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిదన్న విషయంపై ఎక్కువ ఫోకస్ పెడితే మంచిది. ఇందుకు పలు అధ్యయనాలు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా అలాంటి అధ్యయనాల్లో ఆసక్తికర సమాచారాన్ని అందిస్తోంది ఎడిన్ బరో వర్సిటీ శాస్త్రవేత్తల నివేదిక. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగానే కాదు.. సాదాసీదా ప్రజలుసైతం చిన్ చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కోవిడ్ చావుదెబ్బ నుంచి తప్పించుకునే వీలుందని చెప్పాలి. ఎడిన్ బరో నివేదిక ప్రకారం.. సూర్యోదయాన ప్రసరించే కిరణాలు ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తాయన్నది మనకు తెలిసిందే. తాజాగా కోవిడ్ మరణాల్ని అరికట్టటంలో సూర్యుడు ముఖ్య పాత్ర వహిస్తున్నాడని ఈ నివేదిక చెబుతోంది.
సూర్యకిరణాలు.. అందునా అతినీలలోహిత కిరణాలు కోవిడ్ మరణాల్ని తగ్గిస్తున్నట్లుగా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయలెట్ కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉంటాయని.. ఎండ వేడిమిలో ఎక్కువగా ఉండే వారు కొవిడ్ కారణంగా మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేల్చారు.
ఇంత కచ్ఛితంగా ఎలా చెబుతారన్న ప్రశ్నకు ఎడిన్ బరో అధ్యయకర్తలు సమాధానం చెబుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కొవిడ్ కారణంగా మరణించిన వారిపై అధ్యయనాలు నిర్వహించారు. ఈ కాలంలో అమెరికాలోని 2474 గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన అల్ట్రావయలెట్ స్థాయిల్ని పరిగణలోకి తీసుకొని తాజా అంశాల్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఇంట్లో కూర్చోకుండా.. సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటం ద్వారా కరోనా ప్రమాదం నుంచి తప్పించుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.