Begin typing your search above and press return to search.

జనసేన లో ప్రముఖుల చేరికలు దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   8 Feb 2019 3:37 PM IST
జనసేన లో ప్రముఖుల చేరికలు దేనికి సంకేతం?
X
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కిలోకి ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఉన్నత చదువులు - పదవులు చూసిన వారందరికి మొదటి ఆప్షన్ జనసేనే. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలతో పాటు ప్రముఖులు భారీగా చేరుతుండటం గమనార్హం.

ఇప్పటికే ఆ పార్టీలో ఉమ్మడి ఆంధప్రదేశ్ లో స్పీకర్ గా చేసిన నాదెండ్ల మనోహర్ - మాజీ మంత్రులు జనసేనలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రముఖ ఎడ్యుకేషనిస్టు విష్ణు రాజు - ప్రముఖ పర్యావరణవేత్త పుల్లారావు - ప్రముఖ సైంటిస్టు - అబ్దుల్ కలాం సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ పొన్ రాజ్ - రిటైర్డ్ డీఐజీ రవీకుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. వీరందరి చేరికలపై సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుంది. వీరి చేరికలతో జనసేన పార్టీ బలోపేతం అవుతుందని పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వారికి ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కాగా ఉన్నత చదువులు రాజకీయాల్లో ఇప్పటి వరకు రాణించిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. లోక్ సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణ - అమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్ ఇందుకు ఊదాహరణగా నిలుస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కొంత సక్సస్ అయినా ఇతర పార్టీల్లా బలపేతం కాలేదని విమర్శలు ఉండనే ఉన్నాయి. ప్రముఖ రాజకీయ పార్టీలోని ఎంపీ - ఎమ్మెల్సీ లా మాదిరిగా ఉన్నత చదువులు చదివిన వారు సక్సస్ కాలేకపోయారని ఇదిఒకరకంగా జనసేన పార్టీకి మైనస్ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా భాషలో చెప్పాలంటే ఉన్నత వర్గాల వారు ఏ సెంటర్లో మాత్రమే రాణిస్తారని, ఇక బీ - సీ సెంటర్లలో పని చేయరనే విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించాలని పలువురు హితవు పలుకుతున్నారు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీలో ప్రముఖులతో కలిసి చరిత్ర సృష్టిస్తుందా లేక చతికిలపడుతుందో వేచి చూడాలి మరీ..