Begin typing your search above and press return to search.
టాక్ ఆఫ్ ది ఫొటో.. ఇవీ మన చదువులు..
By: Tupaki Desk | 28 July 2018 4:58 AM GMTమన చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు వస్తే కానీ తల్లిదండ్రులు స్కూలుకు పంపించేవారు కాదు.. డైరెక్టుగా 1వ తరగతి నుంచే మన చదువులు మొదలయ్యాయి. ఆ సంవత్సరం తెలుగులో ‘అ - ఆ’ నేర్చుకొని కాసిన్ని పదాలు నేర్చుకోగానే 1వ తరగతి పూర్తి అయిపోయేది. మెల్లగా.. నిదానంగా నేర్చుకున్నాం.. అలా చదుకున్నవారు రాష్ట్రపతులు - ఐటీ కంపెనీలకు అధిపతులు - పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు - ఐఏఎస్ అధికారులు అయిపోయారు..
కానీ ఇప్పుడు రెండున్నరేళ్లకే పిల్లలను స్కూలుకు పంపుతున్నాం. నర్సరీ నుంచే వారిపై మానసిక ఒత్తిడి పెంచుతున్నాం. వేలకు వేల ఫీజులను ప్రైవేటు స్కూళ్లకు దారపోస్తున్నాం.. ఎల్ కేజీ - యూకేజీ - ఆ తర్వాత 1వ తరగతి.. అంటే మూడు సంవత్సరాలు చదివితే కానీ ఒకటో తరగతి వరకూ రాని పరిస్థితి. మనం ఒకటో తరగతి కి కేవలం పలకా బలపం పట్టుకొని వెళితే ఇప్పుడు పిల్లలు బ్యాగ్ నిండా బండెడు పుస్తకాలతో మోయలేని భారాన్ని మోస్తూ వెళుతున్నారు..
అప్పటికీ ఇప్పటికీ కాలం మారింది.. వేగం పెరిగింది.. కానీ చదువుల్లో మాత్రం మార్పులు బాగా వచ్చాయి. ఆధునిక సమాజంతో పోటీపడాలని పిల్లలను యంత్రాలుగా మారుస్తున్నాం.. కానీ వారికి ఆడుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదు. మనం చిన్నప్పుడు ఆడిన కోతికొమ్మచ్చి.. తొక్కుడుబిల్ల లాంటి ఆటల గురించి చెబితే ఇప్పటి పిల్లలు అవేంటి అనే పరిస్థితి . ఇలా చదువుల పేరుతో వారిపై ఇప్పటినుంచే తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాం.. వారి బాల్యాన్ని హరిస్తున్నాం.
తాజాగా ఒక్క ఫొటో మన చదువుల దుస్థితిని కళ్లకు కట్టింది. వనపర్తి జిల్లాలోని ఖిల్లా గణపురం లో ఓ పాఠశాల విద్యార్థులకు అర కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు బండెడు పుస్తకాలతో రోజూ వెళ్లడం తలకు మించిన భారంగా మారింది. దీంతో వారి తల్లిదండ్రులంతా కలిసి ఓ వృద్ధుడిని ఏకంగా స్కూలు బ్యాగులు మోయడానికి కూలికి మాట్లాడుకున్నారు. వృద్ధుడు స్కూలు బ్యాగులను ఓ తట్టలో వేసుకొని ముందు నడుస్తుండగా.. పిల్లలు టిఫిన్ బాక్సులు - నీళ్ల సీసాలు పట్టుకొని వెనుకాలే వస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలు ఎంత భారమయ్యాయి. మన విద్యావ్యవస్థ పిల్లలపై ఎంత భారం వేస్తున్నదనడానికి ఈ చిత్రం నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా మన విద్యావ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే పిల్లల బాల్యాన్ని హరించిన వారవుతామనడంలో ఎలాంటి సందేహం లేదు.