Begin typing your search above and press return to search.
ఏపీ బరిలో భారీగా విద్యా సంస్థల అధినేతలు!
By: Tupaki Desk | 12 March 2019 7:12 AM GMTగతంలో బతకలేని బడిపంతులు అనేవారు. అయితే.. ఇది ఇప్పటి మాట కాదు. దాదాపు ముఫ్ఫై ఏళ్ల క్రితం టీచర్ల పరిస్థితి అలా ఉండేది. ఆ మాటకు వస్తే.. స్కూళ్లు.. కాలేజీలు పెట్టే వారి దృక్ఫదం వేరుగా ఉండేది. వ్యాపారం కంటే కూడా చదువు చెప్పటాన్ని ఒక గౌరవప్రదమైన బాధ్యతగా భావించేవారు.
ఎప్పుడైతే స్కూళ్లు.. కాలేజీల పేరుతో ర్యాంకర్లను తయారు చేసే కర్మాగారాలు మొదలయ్యాయో.. పరిస్థితులు మొత్తం మారిపోయాయి. విద్యాసంస్థలు కాస్తా కార్పొరేట్ విద్యా సంస్థలు అయ్యాయి. మరే రంగంలో లేనంత భారీగా.. బలంగా కార్పొరేట్ విద్యావిధానం పాతుకుపోయింది. పార్టీలు.. ప్రభుత్వాలకు మించిపోయిన ఈ వ్యవస్థకు చెందిన కొందరు ఇటీవల కాలంలో రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎప్పుడైతే నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్సీగా ఎంపికై.. ఏపీ మంత్రి అయ్యారో.. విద్యాసంస్థల అధినేతల్లో రాజకీయ ఆసక్తి అంతకంతకూ ఎక్కువైపోతోంది. దీనికి నిదర్శనంగా తాజాగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న విద్యాసంస్థల అధిపతుల మధ్యన ఉన్న పోటీ ఎంతన్నది టికెట్ల రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
గడిచిన కొంతకాలంగా వివిధ విద్యాసంస్థల అధినేతలు టికెట్ల ప్రయత్నాలు చేయటం.. వారికి కొన్ని పార్టీలు హామీలు ఇవ్వటం జరిగింది. ఇలా ఇచ్చిన వారిలో ప్రముఖ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏపీ ఎన్నికల బరిలోకి దిగాలని ఉత్సాహపడుతున్న విద్యాసంస్థల అధినేతల్ని చూస్తే.. అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావును చెప్పాలి. కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఈసారి ఆయన జగన్ పార్టీ తరపున భీమిలి నుంచి పోటీకి దిగబోతున్నారు.
ఇదిలా ఉంటే.. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత కుమారుడు కృష్ణదేవరాయలు వైకాపా తరఫున గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు.నలంద విద్యాసంస్థల అధినేత వరప్రసాద్ రెడ్డి జగన్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెనాలి సిట్టింగ్ఎ మ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.గుంటూరులోని పూజిత పాఠశాల నిర్వాహకులు హరిప్రసాద్ ఇటీవల టీడీపీలో చేరారు. ఈయన బాపట్ల టిక్కెట్ ఆశిస్తున్నారు.