Begin typing your search above and press return to search.
కామ్రేడ్లను హర్ట్ చేసిన రామోజీ!
By: Tupaki Desk | 29 May 2017 9:05 AM GMTఎవరు అవునన్నా.. కాదన్నా ప్రభావవంతమైన మీడియాల్లో ఈనాడు ఒకటి. మీడియా మొఘల్ రామోజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఈ రోజుకి ఆయన పత్రికకు ఆదరణ ఎక్కువే. అందుకే ఈరోజు వేసిన తాజా కార్టూన్ కొత్త చర్చకు లేవనెత్తింది. కాలానుగుణంగా మారే ఈనాడు గుణాన్నీ చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీకి.. కమ్యూనిస్టుల మీద ఉండే మమకారం ఉండేది. కానీ ఈరోజు కార్టూన్ వారి మనసులను విరిచేలా ఉంది.
తాజాగా ఈనాడులో వేసిన కార్టూన్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో ఈనాడులో వేసే కార్టూన్లు ఆచితూచి వేస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవి. మారిన కాలానికి.. మారిన రాజకీయాలకు తగ్గట్లుగా తన తీరును ఈనాడు కాస్త మార్చుకుందన్న మాట మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తూ ఉంటుంది.
ఇంతకీ ఈరోజు కార్టూన్ లో ఏముందంటే... ఇక దేశంలో కమ్యూనిస్టులు మళ్లీ అధికారంలోకి రాలేరన్న అర్థాన్నిస్తోంది. చైనాలో కమ్యూనిస్టులు పునర్జన్మను నమ్మితే లామాలు వారిని నమ్ముతారంటూ దలైలామా చేసిన వ్యాఖ్యను బేస్ చేసుకొని.. "పునర్జన్మను మేమెలానమ్మాలయ్యా. రష్యాలో కమ్యూనిజం పునర్జన్మ ఎత్తుతుందా.. తూర్పు యూరప్ లో మళ్లీ కమ్యూనిజం పుడుతుందా, బెంగాల్ లో తిరిగి ప్రాణం పోసుకుంటుందా.". అంటూ మీడియా ప్రతినిధితో చైనా కమ్యూనిస్ట్ నేత మాట్లాడుతున్నట్లుగా కార్టూన్ వేశారు. కమ్యూనిస్టులకు ఫ్యూచర్ లేదన్న విషయాన్ని తేల్చి చెప్పినట్లుగా ఉన్న ఈ కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సాధారణంగా ఈనాడులో వార్తలన్నీ ముద్రణకు ముందు రామోజీరావు దృష్టికి వెళ్లవు. కానీ... కార్టూన్స్ మాత్రం ఆయన ఆమోదం తర్వాతే ఈనాడులో ప్రచురితం అవుతాయి. దీన్ని బట్టి... ఈనాడు కార్టూన్లో ఏమొచ్చినా అది రామోజీ అభిప్రాయంగానే అనుకోవాలి. ఆ లెక్కన చూస్తే ఇక ఇండియాలో కమ్యూనిజానికి ఫ్యూచరు లేదని రామోజీ భావిస్తున్నట్టేగా. తాజా కార్టూన్ కామ్రేడ్స్‌ను హర్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/