Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చేలా ఈటల మాస్టర్ ప్లాన్!

By:  Tupaki Desk   |   2 Jun 2021 7:30 AM GMT
కేసీఆర్ కు షాకిచ్చేలా ఈటల మాస్టర్ ప్లాన్!
X
నచ్చిన వారిని ఎంతలా దగ్గరకు తీస్తారో.. నచ్చని వారి విషయంలో అంతే కటువుగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదట్నించి అలవాటే. ఈ మధ్యన తనకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయంలో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉండటమే కాదు.. గతంలో మరే నేత మీద ప్రదర్శించనంత కోపాన్ని.. ఆగ్రహాన్ని చూపిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టీఆర్ఎస్ నుంచి ఎంతో మంది నేతలు వెళ్లిపోవటం ఒక ఎత్తు అయితే.. పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసిన కేసీఆర్.. ఆ నేతను.. వారి విషయాన్ని అక్కడితో వదిలేయటం చూశాం. అందుకుభిన్నంగా పార్టీ నుంచి పంపకుండానే.. భూకబ్జా ఆరోపణలపై కేసు నమోదు చేసే వరకు వెళ్లినా.. పార్టీ నుంచి బయటకు పంపుతూ వేటు వేయకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ప్లానింగ్ కేసీఆర్ కు ఉంటే.. ఆయన గురించి.. ఆయన పట్టుదల.. మొండితనం గురించి బాగా తెలిసిన ఈటల రాజేందర్ అందుకు తగ్గట్లే తన ప్లానింగ్ లో తాను ఉన్నట్లుగా తెలుస్తోంది.

తనను బద్నాం చేసి.. తన ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆయనకు తనదైన శైలిలోషాకిచ్చేందుకు ఈటల ప్లానింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవాళ కాకున్నా రేపటి రోజున లేదంటే నాలుగైదు రోజులు ఆగి అయిన తర్వాత అయినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తోందన్న విషయానికి ఆయన సిద్ధమవుతున్నారు.

తన రాజీనామా తర్వాత వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తనకు బదులుగా తన భార్య జమునను రాజకీయాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ప్రెస్ మీట్ ను ఆమెచేత పెట్టించారని చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన చోటున తన భార్యను బరిలోకి దింపటం ద్వారా.. టీఆర్ఎస్ నేతలకు.. అధినేతకు షాకివ్వాలన్న ఆలోచనలో ఈటల ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన అనుకున్నట్లుగా ఈటల జమున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉప ఎన్నికల రేసులోకి దిగతే.. సానుభూతి వెల్లువలా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.