Begin typing your search above and press return to search.
ఇండియా కొవిడ్ వేరియంట్ ప్రభావం.. రెండో దశ అందుకేనా?
By: Tupaki Desk | 24 April 2021 10:00 PM ISTదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత నెల నుంచి లక్షల మంది కొవిడ్ బారిన పడుతున్నారు. అయితే రెండో దశ ఇంతలా విజృంభించడానికి కారణం ఇండియా కొవిడ్ వేరియంట్? అనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు.
భారత్ వేరియంట్ పై ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వేరియంట్ ఏయే దేశాల్లో ఉందో ఇప్పటికీ సమాచారం లేదు. సహజంగా వైరస్ నిరంతరం మ్యూటేషన్ చెందుతుంది. ఫలితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఇవి కొన్ని అసలు వైరస్ కన్నా బలంగా ఉంటే మరికొన్ని బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇండియా వేరియంట్ అనేది ఎంత సామర్థ్యం గలది అనే అంశంపై అధ్యయనాలు చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు.
జనవరి నుంచి మార్చిలో మహారాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన 361 శాంపిళ్లలో 220 మందిలో ఈ ఇండియా వేరియంట్ ని గుర్తించినట్లు అధ్యయనాల్లో వెల్లడించారు. ఇప్పటివరకు 21 దేశాల్లో గుర్తించినట్లు తెలిపారు. ఫిబ్రవరి తర్వాత బ్రిటన్ లో ఇలాంటివి 103 కేసులు గుర్తించగా... ప్రస్తుతం భారత్ నుంచి రాకపోకలకు ఆ దేశం అనుమతించడం లేదు. కానీ ఇది ఎంతవరకు ప్రమాదకరం అనేది దానిపై స్పష్టత రాలేదంటున్నారు పరిశోధకులు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల వేరియంట్లతో భారత్ వేరియంట్ కొన్ని పోలికలు కలిగి ఉందని వెల్లడించారు.
బ్రిటన్ లో గుర్తించిన వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ నుంచి తప్పించుకొని శరీరంలోకి ప్రవేశించగలిగే శక్తి ఉందని అన్నారు. భారత్ వేరియంట్ ప్రభావం ఎంత అనేదానిపై స్పష్టత లేదని వెల్లడించారు. అందుకు ఎక్కువ పరిశోధనలు చేయలేదని అన్నారు. భారత్ నుంచి కేవలం 298 శాంపిళ్లనే పరీక్షించినట్లు వివరించారు. మిగతా దేశాల్లో 656 శాంపిళ్లను పరీక్షించగా.. బ్రిటన్ 3,84,000 శాంపిళ్లపై పరిశోధనలు జరిపినట్లు తెలిపారు.
భారత్ లో జనాభా, జనసాంద్రత ఎక్కువ అయినందున వైరస్ వేగంగా విస్తరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా వేరియంట్ గతేడాది నుంచే ఉందని... సెకండ్ వేవ్ కు కారణం అదే అయితే గతేడాది నుంచి ఇదే తరహా కేసులు ఉండేవని చెబుతున్నారు. దీనిపై వ్యాక్సిన్ ప్రభావమెంత అనేది ఇప్పుడే చెప్పలేకపోయినా వైరస్ వ్యాప్తిని టీకాలు నిరోధిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొంత వరకు అరికట్టవచ్చని అంటున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి విజృంభణను కట్టడి చేయగలమని అన్నారు.