Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువ.. ఎందుకో తెలుసా?
By: Tupaki Desk | 5 Feb 2022 2:30 AM GMTకరోనా వైరస్ గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. వేరియంట్ల రూపంలో దశలవారీగా కోరలు చాస్తోంది. మన దేశంలో గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాదిలోని జనవరి మొదటి రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఇతర దేశాల్లో పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉంది. ఒక్కో దేశంలో ఒక్కో పరిస్థితి ఉంది. అయితే ఇటీవల వైరస్ కేసులు పెరగడానికి కారణం దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన ఒమిక్రాన్. దీని కారణంగా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ వేరియంట్ కు అతి త్వరగా వ్యాపించే లక్షణం ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. కానీ దీని ప్రభావం మాత్రం చాలా తక్కువేనని చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ కు జెట్ స్పీడ్ లో వ్యాపించే లక్షణం ఉంటుందన్న వైద్య నిపుణులు... మన ఆరోగ్యంపై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇందుకు గల కారణాలపై అమెరికా పరిశోధకులు అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన నివేదిక న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితం అయింది. ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉండటానికి కారణం మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి అని శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్లు, వైరస్ నుంచి పొందిన రోగ నిరోధక శక్తి వల్లే కొత్త వేరియంట్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అన్నారు. వైరస్ వ్యాపించినా కూడా అందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని గుర్తించారు. ఆస్పత్రిలో చేరిక, వైద్యుల చికిత్స చాలా తక్కువ మందికి అవసరం అయ్యాయని.. మెజారిటీ మంది ఇంట్లోనే కోలుకున్నారని వెల్లడించారు.
ఈ కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికా లోని బోట్సునావాలో వెలుగు చూసింది. అయితే అప్పటి నుంచి తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంది. దీనికి కారణం ఆ దేశంలో చాలా మంది వైరస్ తీసుకుని ఉండడం లేదా ఇదివరకే మహమ్మారి బారిన పడడం. ఈ రెండు మార్గాల్లో ఆ దేశ ప్రజలు రోగ నిరోధక శక్తిని అధికంగా కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు చెప్పారు. అందువల్లే వేరియంట్ ముందు నుంచి అతి తక్కువ తీవ్రత కలిగి ఉందని అన్నారు. ప్రభావం తక్కువగా ఉన్నా కూడా వ్యాప్తి మాత్రం అధికంగా ఉంది. అంతేకాకుండా ఇతర వేరియంట్ల పుట్టుకకు కారణమైంది.
వ్యాక్సిన్ తీసుకోవడం లేదా కరోనా బారిన పడి కోలుకోవడం వల్ల వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇకపోతే వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని సూచిస్తున్నారు. టీకా తీసుకుంటే వైరస్ నుంచి ముప్పు చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. వేరియంట్లు పుట్టుక సమయంలోనే చాలా తక్కువ ప్రభావం చూపే విధంగా రూపొందుతాయని చెబుతున్నారు. అలా అయితే కొత్త రకాలు వచ్చినా కూడా పెద్దగా ప్రభావం ఉండదని... ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. ఇకపోతే భారతదేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసు చురుగ్గా సాగుతోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా క్రమంగా దిగువకు వస్తోంది.