Begin typing your search above and press return to search.
పేద దేశాలు- పేద ప్రజలపై కరోనా ప్రభావమెంత?
By: Tupaki Desk | 13 Sep 2020 2:30 AM GMTకరోనా ధాటికి యావత్ ప్రపంచమే క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. లాక్ డౌన్ కారణంగా వివిధ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా పేద దేశాల్లో ఉంటున్నవారు, యువత ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
తాజాగా జరిగిన సర్వేలో పేదదేశాల్లో ఆదాయం పడిపోయినట్లు ఏకంగా 69శాతం మంది చెప్పారు. ధనిక దేశాల్లో 45శాతం మంది ఆదాయం పడిపోయిందని వివరించారు. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు.
పేద దేశాల ప్రజలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తాజా సర్వే తేల్చింది. ఇప్పటికీ అసమానతలు ఉన్నాయని వివరించింది. యూరప్, ఉత్తర అమెరికాల కన్నా అమెరికా, ఆసియా, ఆఫ్రికాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.
అత్యధికంగా కెన్యాలో 91శాతం, థాయిలాండ్ లో 81శాతం, నైజీరియాలో 80శాతం, దక్షిణాఫ్రికాలో 77శాతం, ఇండోనేషియాలో 76శాతం, వియత్నాంలో 74శాతం మంది ప్రజలపై కరోనా ప్రభావం పడిందని తేలింది. ఈ దేశాల్లోని ప్రజల వద్ద డబ్బు మరింత తగ్గిపోయిందని తేలింది.
ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, రష్యా, బ్రిటన్ లాంటి దేశాల్లో మాత్రం బాగా సంపాదిస్తున్న వారే ఎక్కువ ప్రభావం ఎదుర్కొంటున్నారు.