Begin typing your search above and press return to search.
డిగ్గీ రాజాకు బ్యాండ్ బాజా బారాతేనా
By: Tupaki Desk | 21 March 2019 2:08 PM GMTఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవ్వడం రాజకీయాల్లో సర్వసాధారణం. మన టైమ్ నడుస్తున్నప్పుడు ఎంజాయ్ చెయ్యాలి. టైమ్ బాగోలేనప్పుడు పక్కకు వెళ్లి కూర్చోవాలి. ఒకప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ రాజకీయాల్ని శాసించిన దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు కన్వీనర్ గా వ్యవహరించి కాంగ్రెస్ లో అన్ని చక్రాలు తెగ తిప్పేసి డిగ్గీ రాజాకు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కన్పిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. క్రమక్రమంగా పార్టీలో ప్రాధాన్యం కోల్పోయిన డిగ్గీరాజాను కాంగ్రెస్ వదిలించుకునే పనిలో ఉందని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే గోవాలో అత్యధిక సీట్లు గెలిచినా కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఈ స్టేట్ కు కాంగ్రెస్ కు ఇంచార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ అలసత్వం వల్లే గోవాలో అధికారం మిస్ అయ్యిందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. దీంతో అప్పటినుంచి డిగ్గీ రాజాను దూరం పెట్టేసింది. ఇప్పుడు పూర్తిగా పార్టీ నుంచి సాగనంపడానికి.. అసలు కాంగ్రెస్ కు ఏమాత్రం పట్టులేని ఓ నియోజకవర్గంలో బరిలోకి దింపబోతుంది. ఇక గెలిస్తే ఓకే. గెలవకపోతే.. పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. లోపల ఓటమి భయం ఉన్నా పైకి మాత్రం రాహుల్ ఆదేశిస్తే తాను ఎక్కడనుంచి అయినా పోటీ చేస్తానంటూ దిగ్విజయ్ బీరాలు పలుకుతున్నారు. మరోవైపు దిగ్విజయ్ కు కమల్ నాథ్ - జ్యోతిరాధిత్య సింథియాలు కూడా పోటీగా తయారయ్యారు. వారి ప్రాభావం పెరిగడం - డిగ్గీ ప్రాభవం క్రమ క్రమంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ దిగ్విజయ్ ఓటమి పాలైతే ఇక ఆయన రాజకీయ భవితవ్యం అగమ్య గోచరమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.