Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ పై కోడిగుడ్లతో దాడి!
By: Tupaki Desk | 25 Aug 2016 1:57 PM GMTపాకిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది మాజీ ఎంపీ - నటి రమ్య. శాంతి కోసమే పాకిస్థాన్ వెళ్లి వచ్చానని చెప్పిన రమ్యకు మంగళూరులో అనూహ్యమైన అనుభవం ఎదురైంది. మంగళూరు విమానాశ్రయం బయట ఆమెపై దాడికి కొంతమంది ప్రయత్నించారు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రమ్యపై గుడ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. రమ్యపై ఇలా దాడి చేసినవారు ఎవరు అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ కి చెందినవారై ఉంటారని కొంతమంది అనుమానిస్తుంటే.. వారితోపాటు - భజరంగ్ దళ్ కు చెందినవారు కూడా ఆందోళనకారుల్లో ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్నవారిని విచారించాక కారకులు ఎవరో చెబుతామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రమ్యకు సంబంధించిన ప్రతీ వార్తపైనా పాకిస్థాన్ ఆసక్తికరబరుస్తూ ఉండటం విశేషం!
తమకు అనుకూలంగా ఎవ్వరు మాట్లాడినా విశేష ప్రాధాన్యత ఇచ్చేయడం పాక్ మీడియాకి బాగా అలవాటైపోయింది! నటి రమ్య విషయమే చూడండి... పాకిస్థాన్ కు అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయగానే, అక్కడ సెలెబ్రిటీ అయిపోయారు! రమ్యను పాక్ మీడియా తెగ మోసేస్తోంది. ది డాన్ - నేషన్ ఇంగ్లిష్ - జంగ్ వంటి ప్రముఖ ఉర్దూ పత్రికలు రమ్యకు ఫస్ట్ పేజీల్లో ప్లేసులు ఇస్తున్నాయి. రమ్య విషయంలో జరుగుతున్న ప్రతీ డెవలప్ మెంట్ నూ రాసేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇండియావైపే చూస్తోంది. కొందరు అభిప్రాయపడుతున్నట్టుగా పాకిస్థాన్ నరకం కాదనీ, అక్కడ కూడా ప్రజలు మనలానే ఉంటున్నారనీ, మనల్ని బాగా చూసుకుంటున్నారనీ రమ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెప్పేది లేదని కూడా ఆమె తెగేసి చెప్పారు. దీంతో కర్ణాటకలోని కొడుగలో ఒక న్యాయవాది రమ్యపై దేశద్రోహం కేసుపెట్టారు. దీంతో రమ్యకు సంబంధించిన ప్రతీ వార్తానూ ఆసక్తిగా గమనిస్తోంది పాక్. అక్కడ ఆమెని నెత్తిన పెట్టుకుని మోస్తుంటే.. మనదేశంలో తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వస్తోంది.