Begin typing your search above and press return to search.
ఏపీ - జంపింగ్ ఎమ్మెల్యేపై కోడిగుడ్ల దాడి
By: Tupaki Desk | 12 Dec 2017 5:35 AM GMTపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ప్రజల్లో పెద్ద ఎత్తున్నే అసంతృప్తి గూడు కట్టుకొని ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజలు...మరో అడుగు ముందుకు వేసి ఏకంగా కోడిగుడ్లు విసిరారు. ఇలా ప్రజల చేతిలో అవమానాల పాలు అయింది ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి - వైసీపీలో గెలిచి టీడీపీలో చేరి అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ పరాభవానికి గురయ్యారు.
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పరంగా చేపట్టిన ఇంటింటికీ టీడీపీని అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామంలో చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతుండగా...ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరేశారు. దీంతో సభలో కలకలం రేగింది.
ఎమ్మెల్యే లక్ష్యంగా కోడిగుడ్ల దాడి చేసిన ఘటనపై అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు పలువురిని అనుమానించి వారిపై చేయిచేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. తమ గ్రామంలో సభ పెట్టి...తమ ఊరి వారినే అనుమానించడం..దాడి చేయడం ఏమిటని గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కోడిగుడ్లు విసిరారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులను స్థానిక మీడియా ప్రతినిధులు సంప్రదించగా...ఆకతాయిలు ఎవరో మద్యం మత్తులో చేసిన పనిగా భావిస్తున్నామన్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే తనపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ పరిణామాన్ని ఎమ్మెల్యే సన్నిహిత వర్గాలు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యేపై బంతిపూలు అనుకోని చూసుకోకుండా కోడిగుడ్లు విసిరారని పేర్కొంటోంది.