Begin typing your search above and press return to search.
దేశాధ్యక్షుడి ప్రకటన అంతు చూస్తామని హెచ్చరిక
By: Tupaki Desk | 17 Nov 2015 2:23 PM GMTఉగ్రవాదంపై ప్రపంచదేశాలన్నీ ఐక్యం అవుతున్నాయి. ఒక్కోదేశాన్ని ఒక్కోరకంగా ఇబ్బందుల పాలుచేస్తున్న ఉగ్రవాదులు ఆయా దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా ఆయా దేశాధినేతలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల పీచముడిచేందుకు కంకణం కట్టుకున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా ఇదే తరహా హెచ్చరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిముర్ పుతిన్ ప్రకటించారు.
ఈజిప్టులోని సినాయ్ దీవుల్లో అక్టోబర్ 31న రష్యా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలోని ప్రయాణికుల్లోని 224 మందిలో ఏ ఒక్కరూ మిగల్లేదు. వారితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా మరణించారు. ఇందులో ముగ్గురు మినహా అందరూ రష్యన్లే. 17 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తుళ్లుతూ పాడుతూ ఎంతో సరాదాగా టూరిస్టు స్పాట్‌ల్లో గడిపిన ఈ చిన్నారులంతా, చిధ్రమైన శరీరాల సరసన చేరడం అత్యంత విషాదకరంగా మారింది.దీని వెనక ఐఎస్ఐఎస్ ఉందని భావించారు. ఈ ఘటనపై పుతిన్ తాజాగా స్పందిస్తూ కూల్చివేతకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.
రష్యా భద్రతా చీఫ్ అలెగ్జాండర్ బోట్ర్ నికోవ్ తో పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయి విమానం ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందని స్పష్టం చేయడంతో పుతిన్ ఘాటుగా స్పందించారు. విమానం కూలిపోయేందుకు కారణమైన వారు ఎక్కడ దాగివున్నా... వారి వెతికి మరీ పట్టుకుంటామని ప్రకటించారు. ప్రపంచంలోని ఏ మూల దాగున్నా సరే వారిని శిక్షించి తీరుతామని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. నిందితులను పట్టించిన వారికి మన దేశ కరెన్సీలో రూ.330 కోట్ల రివార్డు (50 మిలియన్ డాలర్లు) ను కూడా ఆ దేశం ప్రకటించింది.