Begin typing your search above and press return to search.
షాక్ షాక్.. విమానాన్ని హైజాక్ చేశారు
By: Tupaki Desk | 29 March 2016 8:22 AM GMTఓవైపు పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. ఓవైపు బ్రస్సెల్స్ విమానాశ్రయంలో పేలుళ్లు.. ఉగ్రవాదుల ఈ అరాచకాలు చూసి అంతర్జాతీయ సమాజం నివ్వెర పోతుంటే.. ఇంతలోనే ముష్కరులు మరో దారుణానికి ఒడిగట్టారు. ఈజిప్టుకు చెందిన విమానాన్ని హైజాక్ చేశారు. అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఐతే అందులోంచి 30-40 మందిని విడిచిపెట్టినట్లు కూడా చెబుతున్నారు. తమ విమానం ఎంఎస్-181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు కూడా ధ్రువీకరించారు.
విమానాన్ని సైప్రస్ లోని లార్నాక విమానాశ్రయంలో ఉగ్రవాదులు బలవంతంగా దించేశారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైజాకర్లు కంట్రోల్ టవర్ తో సంప్రదింపులు జరిపారు. అరగంట తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. హైజాకర్లు ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు బయటపెట్టలేదు. విమానాశ్రయంలో ప్రభుత్వం రెస్క్యూ టీంను దించింది. విమానంలో ఉన్న ఉగ్రవాదుల దగ్గర ఆయుధాలున్నట్లు చెబుతన్నారు. ఉగ్రవాదుల్లో ఒకరు తాను కట్టుకున్న బాంబుల బెల్టును పేల్చేస్తానంటూ పైలట్‌ను బెదిరించినట్లు తెలిసింది.
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా దారుణాలకు ఒడిగడుతున్న ఐసిస్ ఉగ్రవాదులే ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. సిరియాలో అమెరికా కొన్నాళ్లుగా పెద్ద త్తున ఐసిస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. దానికి ప్రతీకారంగానే విమానాన్ని హైజాక్ చేశారని భావిస్తన్నారు. విమానంలో ఉన్న మహిళలు, పిల్లలను మాత్రం బయటకు పంపేందుకు అంగీకరించి.. దాదాపు 40 మందిని విడిచిపెట్టినట్లు చెబుతున్నారు.