Begin typing your search above and press return to search.
రంజాన్: భారత్ ఒకవైపు, ప్రపంచమొకవైపు
By: Tupaki Desk | 6 July 2016 4:44 AM GMTరంజాన్ ఎప్పుడంటే జులై 6 అని చటుక్కున చెబుతారు. అదే రోజు సెలవంటూ సిద్ధమైనోళ్లు చాలామందే ఉన్నారు.అయితే.. రంజాన్ బుధవారం కాదని.. గురువారం అంటూ జామా మసీదు ఇమాం ప్రకటించారు. దీంతో.. ప్రపంచదేశాల్లో రంజాన్ ఈ రోజు ఘనంగా నిర్వహిస్తుంటే.. భారత్ లో మాత్రం గురువారం నిర్వహించనున్నారు.
రంజాన్ పండుగను జామా మసీదు ఇమాం ప్రకటన ఆధారంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత.. జామా మసీదు ఇమాం ఒక ప్రకటన చేస్తూ.. భారత్ లోని ముస్లింలు ఈద్ ఊల్ ఫితర్ ను బుధవారం కాకుండా గురువారం చేసుకోవాలని ప్రకటించారు. దీంతో.. మరికొద్ది గంటల్లో రంజాన్ పర్వదినంగా భావించిన వారంతా పండుగను ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి.
అదే సమయంలో రంజాన్ సెలవును కూడా సవరిస్తూ ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇమాం ప్రకటన నేపథ్యంలో ప్రపంచ దేశాన్నీ బుధవారం రంజాన్ ను ఘనంగా జరుపుకోనుంటే.. భారత్ మాత్రం గురువారం రంజాన్ పండుగను జరుపుకోనుంది. దీంతో నెల రోజుల పాటు ముస్లింలు నిష్ఠగా ఆచరించే రోజాను భాతీయులు గురువారం విరమిస్తారు. మొత్తంగా చెప్పేదేమంటే.. రంజాన్ ఇవాళ (బుధవారం) కాదన్న విషయంలో అప్ డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది.