Begin typing your search above and press return to search.
ఈఫిల్ టవర్ ఎత్తు మరింత పెరిగిందా.. ఎలా, ఎందుకు?
By: Tupaki Desk | 13 April 2022 12:30 AM GMTప్రపంచం లోని ఎత్తైన కళా ఖండంగా ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే ఆకాశం అంత ఎత్తుగా ఉన్నట్లు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. అంటే 1063 అడుగులు. ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు ఆరు మీటర్లు.. అంటే 19.69 అడుగుల డిజిటల్ రేడియో యాంటీనా ను అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లు అయింది.
130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టవర్ ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ.. శతాబ్దానికి పైగా ప్రపంచ పర్యాటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటెన్నాలను అమర్చి ప్రసారాల కోసమూ ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటెన్నా మార్చిన ప్రతి సారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది.
తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటెన్నా ను మార్చారు. హెలికాప్టర్ సాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటెన్నా ను కేవలం 10 నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు ఆరు మీటర్ల పెరిగి 330 మీటర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్ ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్ నిర్మాణం 1889 మార్చి 15 నాటికి పూర్తయింది. గుస్తావ ఐఫిల్ కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజినీరింగ్ సంస్థ రూపొందించింది.
ఆయన పేరు మీదే దీనికి ఐపిల్ అనే పేరు వచ్చినప్పటికీ... ప్రస్తుతం ఇది ఈపిల్ టవర్ గా మారిపోయింది. అంతే కాదండోయ్ ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు కాగా... అందులో లోహపు బరువు 7,300 టన్నులు. ఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు.
ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పు కోసం దీన్ని రూపొందించాడని... చాలా మంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణం లో నిష్ణాతులైన ఈఫిల్, అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు.
అందుకే బలమైన గాలులకు కూడా దాన్ని తట్టుకొనేలాగా... నిర్మించారు ఈఫిల్ అనుకున్నట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకునేలా నిర్మించి... తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు.