Begin typing your search above and press return to search.
అమెరికాలో 8మంది భారతీయుల అరెస్ట్?
By: Tupaki Desk | 31 Jan 2019 5:29 AM GMTఅమెరికాలో 10మంది తెలుగు విద్యార్థులను హోంల్యాండ్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మిచ్ గాన్ లోని నకిలీ ఫార్మింగ్ యూనివర్సిటీ పేరుతో విదేశీ విద్యార్థులు భారీగా నకిలీ వీసాలు పొంది అమెరికాలో ప్రవేశించడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సరైన అనుమతి లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులను కూడా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నకిలీ యూనివర్సిటీ పేరుతో చాలామంది విదేశీ విద్యార్థులు నకిలీ వీసాలు తీసుకోవడం గమనార్హం.
ఈ నకిలీ వీసాల కుంభకోణంలో ఎనిమిదిని సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఎనిమిది మంది వ్యక్తులు అక్రమ పద్ధతిలో నకిలీ యూనివర్సిటీని సృష్టించి విదేశాల్లోని 600 మంది విద్యార్థులకు సహాయం చేస్తారు. వలసదారుల ఉల్లంఘన ఆరోపణలపై విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం అమెరికాలో కలకలం రేపుతోంది.
ఈ అరెస్టులు అమెరికాలోని కొలంబస్ - ఓట్టావా - హూస్టన్ - టెక్సాస్ - అట్లాంట - సెయింట్ లూయిస్ - మాన్ హట్టన్ - న్యూయార్క్ - న్యూజెర్సీ సహా ఫార్మింగ్టన్ యూనివర్సిటీ మిచిగాన్ పేరుతో వీసాలు తీసుకున్న విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ యూనివర్సిటీ నుంచి సీపీటీ - మాస్టర్స్ నకిలీ డిగ్రీలను తీసుకున్న పాత విద్యార్థుల లిస్ట్ ను కూడా అమెరికా యూఎస్సీఐఎస్ ఆరాతీస్తోంది. వారు చట్టపరంగా ఈ పట్టాలు తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలిస్తోంది. ఈ విద్యార్థులు పట్టబడితే అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. అదేసమయంలో దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఐదు సంవత్సరాల వరకు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు. కాగా ఎంఐఐ పార్మింగ్టన్ యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రస్తుతం పేర్లు నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థులకు అనేక మంది కాల్స్ చేస్తున్నారు. ఆ వీసాతో రావద్దని సూచనలు చేస్తున్నారు.