Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఒక్కరోజులో 8 కరోనా పాజిటివ్ కేసులు
By: Tupaki Desk | 19 March 2020 2:47 AM GMTముందుచూపు.. అప్రమత్తత.. అంతకుమించిన పక్కా ప్రణాళిక. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. కొద్దిమంది నిర్లక్ష్యం వందలాది మంది మూల్యం చెల్లించాల్సి వచ్చే పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం అనుమానం వచ్చినా కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ అదే పనిగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని వారి పుణ్యమా అని తెలంగాణలో ఒక్కరోజులో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నిజానికి.. ఈ ఉదంతంలో తెలంగాణ ప్రభుత్వ అధికారుల్ని ప్రశంసించాలి. వారు అలెర్ట్ గా ఉండి.. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో ఒక కన్నేసి ఉండటం.. వారికి ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు జరపటం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా చెప్పాలి. అయితే.. తాజాగా వెలుగు చూసిన ఎనిమిది పాజిటివ్ కేసుల కారణంగా ముప్పు పొంచి ఉందని మాత్రం చెప్పక తప్పదు.
బుధవారం రాత్రి పది గంటల సమయం వరకూ తెలంగాణలో ఒక్క కరోనా కేసు మాత్రమే కొత్తగా పాజిటివ్ గా తేలినట్లుగా అధికారిక సమాచారం వెల్లడైంది. కానీ.. రాత్రి పదకొండు గంటల సమయానికి కాస్త అటుఇటుగా ఒక నోట్ విడుదలైంది. దీన్ని చూసినంతనే వణికే పరిస్థితి. ఎందుకంటే.. బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణలో కొత్తగా ఎనిమిది మందిలో కరోనా వైరస్ నిర్దారణ అయినట్లుగా సదరు నోట్ లో పేర్కొన్నారు. బుధవారం పాజిటివ్ గా తేలిన ఎనిమిది మందిలో ఏడుగురు ఇండోనేషియాకు చెందిన వారు కాగా.. మరొకరు మేడ్చల్ కు చెందిన కుర్రాడు. ఇతగాడు ఇటీవల స్కాట్ లాండ్ నుంచి వచ్చినవాడు. అంటే.. బుధవారం పాజిటివ్ గా తేలిన ఎనిమిది మంది ఫారిన్ ట్రావెల్ హిస్టరీ ఉన్న వారే కావటం గమనార్హం.
ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు పది మంది వచ్చారు. వారిలో ఒకరికి కరోనా నిర్దారణ కావటంతో.. మిగిలిన తొమ్మిది మందికి పరీక్షలు నిర్వహించారు. వారిని అత్యవసరంగా హైదరాబాద్ లోని ఛాతీ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుగురికి వైరస్ నిర్దారణ కావటంతో కలకలం రేగింది. కరీంనగర్ లో వారెవరిని కలిశారు? ఎంతమందిని కలిశారు? ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు ఎలా వచ్చారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఆరా తీయటంతో పాటు.. ఇప్పుడు వారెవరెవరిని కలిశారు? అన్న అంశం మీద అధికారులు ఆరా తీస్తూ.. వారందరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
బుధవారం ఒక్కరోజులో బయటకు వచ్చిన కరోనా పాజిటివ్ కేసులతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 13గా తేలింది. వారిలో ఒకరు కరోనాను జయించి డిశ్చార్జ్ కాగా.. పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు. ఆ పన్నెండులో ఎనిమిది మందికి కరోనా ఉన్నట్లుగా బుధవారం నిర్దారణ అయ్యింది. దీంతో.. ఇప్పటివరకూ సింగిల్ డిజిట్ లో ఉండి.. కరోనా పాజిటివ్ కేసులో వెనకగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఎంతమందికి పాజిటివ్ లక్షణాలు ఉండనున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది.