Begin typing your search above and press return to search.
ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు ఎందుకొచ్చారు?
By: Tupaki Desk | 19 March 2020 3:52 AM GMTకరోనా వ్యాప్తి కాకుండా చెక్ చెబుతూ.. అన్ని విషయాల్లో ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద పరీక్ష ఎదురైంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన ఒక టీం పుణ్యమా అని.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా 13కు చేరుకున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే ఎనిమిది కేసులు పాజిటివ్ కాగా.. అందులో ఏడుగురు ఒకే టీంకు చెందిన వారు కావటం గమనార్హం.
ఒక మత సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు ఒక టీం వచ్చింది. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వారితో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి ఈ టీంను తీసుకొని సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో ఎస్ 9 బోగీలో ప్రయాణించారు. రామగుండం చేరుకున్న వారు తర్వాత కరీంనగర్ కు చేరుకున్నారు. మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా వచ్చిన వారిలో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్ గా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఈ టీంలోని మిగిలిన పదిమందిని (తొమ్మిది మంది ఇండోనేషియా జాతీయులు.. మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు) తరలించి.. వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
తొలుత కరోనాను గుర్తించిన ఇండోనేషియా వాసి నిమోనియాతో బాధ పడుతున్నాడు. అతడ్ని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా తమకు తెలిసిందని ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ.. అక్కడ నుంచి రామగుండం.. ఆ తర్వాత కరీంనగర్ కు చేరుకున్న వారు ఎంతమందిని కలిశారు? ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ప్రయాణించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ బోగీలో 82 మంది ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఇప్పుడెక్కడ ఉన్నారు? వారి ఆరోగ్యం ఎలా ఉంది? అన్న అంశాన్ని లెక్క తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.