Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లికి పాజిటివ్ కాదు కానీ.. వారింట్లో వారికి మాత్రం?

By:  Tupaki Desk   |   27 July 2020 6:15 AM GMT
ఎర్రబెల్లికి పాజిటివ్ కాదు కానీ.. వారింట్లో వారికి మాత్రం?
X
కరోనా వేళ.. ఆ నేతకు పాజిటివ్.. ఈ నేతకు పాజిటివ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో.. సదరు నేత అనుచరులు.. అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతంపై ఆయన స్పందించారు.

తాను ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. తనపై జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదని.. తాను క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆయన స్పష్టం చేస్తున్నారు. తనకు కరోనా రాలేదని.. తేల్చారు. తన విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

తనకు పాజిటివ్ కాకున్నా.. హైదరాబాద్.. పర్వతగిరిలోని తన ఇళ్లల్లో పని చేసే వారందరికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షల్లో ఎస్కార్ట్ .. పైలట్ వాహనాల్లో పని చేసే వారు.. మరో వాచ్ మన్.. ఇలా మొత్తం ఆరుగురికి పాజిటివ్ గా తేలినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నట్లు గా చెప్పారు. ఇదిలా ఉంటే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో ఆయన కుమారుడు.. కోడలు.. ఇట్లో పని చేసే ఇద్దరు పని వాళ్లు.. వారి ఇద్దరి పిల్లలకు పాజిటివ్ గా తేలిందని.. వారంతా వైరస్ నుంచి కోలుకున్నట్లుగా వెల్లడించారు.