Begin typing your search above and press return to search.

అధికార పార్టీ నేత దారుణ హత్యకు ప్రతీకారంగా 8 మందిని చంపేశారు

By:  Tupaki Desk   |   23 March 2022 10:36 AM IST
అధికార పార్టీ నేత దారుణ హత్యకు ప్రతీకారంగా 8 మందిని చంపేశారు
X
దారుణ హత్యాకాండకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది పశ్చిమ బెంగాల్. అధికార పార్టీకి చెందిన ఒక నేతను దారుణంగా చంపేసిన ఉదంతంలో ప్రతీకారంగా మరో ఎనిమిది మందిని చంపేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

సంచలనంగా మారిన ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. అధికార టీఎంసీకి చెందిన ఒక నేతను ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. బర్షాల్ గ్రామ పంచాయితీకి చెందిన బధు షేక్ సోమవారం రాత్రి ఎనిమిదన్నర గంటల వేళలో ఆయన్ను చంపేశారు.

దీనికి ప్రతిగా ఆయన వర్గీయులు పగతో.. ప్రతీకారాన్ని తీర్చుకోవాలని తపించారు. తమ నేతను దారుణంగా హత్య చేసిన వారిపై వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు.

అంతే.. ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పు పెట్టేశారు. దీంతో ఒకే ఇంట్లో ఏడుగురు మంటల్లో చిక్కుకొని మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో.. గాయాల బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.

ఈ ఉదంతంపై పోలీసులు స్పందించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామనిచెబుతున్నారు. ఈ ఘటన లెక్క తేల్చేందుకు గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేశారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం బెంగాల్ లో తీవ్ర సంచలనంగా మారింది.

ఈ కేసును తొక్కి పట్టేందుకు అధికార టీఎంసీ ప్రయత్నిస్తుందని బీజేపీ.. సీపీఎం పార్టీలు విమర్శించాయి. ఈ ఉదంతం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు కరవు అయ్యయని.. రాష్ట్రపతి పాలనను విధించాలని పేర్కొన్నారు. మరి.. ఈ డిమాండ్ పై రాష్ట్ర గవర్నర్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.