Begin typing your search above and press return to search.

ఎనిమిదేళ్లు.. కేసీఆర్ ఏం చేశారు: రేవంత్ ఫైర్‌

By:  Tupaki Desk   |   17 Sep 2022 10:57 AM GMT
ఎనిమిదేళ్లు.. కేసీఆర్ ఏం చేశారు:  రేవంత్ ఫైర్‌
X
దేశం, రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ కొందరు చరిత్రను వక్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సర్ధార్‌ వల్లాభాయి కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైం దని రేవంత్ అన్నారు. స్వాతంత్య్ర, సాయుధ పోరాట సమయానికి బీజేపీ అసలు పుట్టలేదని పేర్కొన్నా రు.

రాజకీయ కోణంలోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ స్వాతంత్య్ర‌ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయజెండా ఎగురవేసి కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూల దండ వేశారు. అనంత‌రం రేవంత్ మాట్లాడుతూ.. హిందు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛ అని రేవంత్ అన్నారు. అమరులు, వీరులను స్మరించుకుంటూ.. వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బైరాన్పల్లి ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయని తెలిపారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం దండు కట్టిండ్రు.. దళంగా కదిలిండ్రు అని గుర్తుచేశారు. దేశం, రాష్ట్రానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది.. కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17 ఉత్సవాలు చేయని టీఆర్ ఎస్‌ సర్కార్కు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. 1950లో గాంధీ భవన్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పునాదులు వేశారన్నారు. పటేల్కు పూలదండ వేసే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని రేవంత్‌నిప్పులు చెరిగారు. మోడీ సర్కార్ విస్తరించడానికి కుట్రలు చేస్తోంద‌న్నారు. కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతోంద‌న్నారు. విడగొట్టే పనిలో మీరున్నరు.. కలిపే పనిలో మేమున్నాం అని రేవంత్ వ్యాఖ్యానించారు.

"వాట్స్ ఆఫ్ యూనివర్సిటీలో ఓవర్ నైట్ పని చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక కేసీఆర్ స్వీయ చరిత్ర, కుటుంబ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నాడు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక 'టీఎస్'ను 'టీజీ'గా మారుస్తాం. అందెశ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా చేస్తాం. కొత్త జెండా రూపుద్దిద్దుకుంటుంది. దానికి యువత, కవులు కళాకారుల మేధావుల ఆలోచనలు పంపాలి. సబ్బండ వర్గాల ప్రజల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని" రేవంత్ రెడ్డి తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.