Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్: దేశంలో కరోనాను తట్టుకునే శక్తి వచ్చింది
By: Tupaki Desk | 22 July 2020 1:30 AM GMTదేశాన్ని కరోనా ఆవహించింది. పట్టి పీడిస్తోంది. రోజుకు 40వేలకుపైగానే కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రాల్లో కేసుల జాతర మొదలైంది. అయితే ఊరటనిచ్చే విషయం ఏంటంటే దేశంలోని 18కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తమ శరీరంలో కరోనా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని ‘థైరోకేర్ ’ అనే ప్రైవేట్ ల్యాబ్ సంస్థ సర్వే చేసి వెల్లడించింది.
తాజాగా 20రోజుల పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో 60వేల మందికి యాంటీబాడీ టెస్టులు థైరోకేర్ సంస్థ నిర్వహించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో 18కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తమ శరీరంలో కరోనా రోగ నిరోధక శక్తిని.. కరోనా వ్యతిరేక యాంటీ బాడీస్ కలిగి ఉన్నారని థైరోకేర్ అభిప్రాయపడింది.
సాధారణంగా కరోనా సోకి కోలుకున్న తర్వాతే ఆ వ్యక్తుల శరీరంలో కరోనా వ్యతిరేక రోగ నిరోధక శక్తి , యాంటీ బాడీలు తయారవుతాయనే విషయం తెలిసిందే. అయితే చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా బారిన పడుతున్నారు. కరోనా ఉన్న విషయం వారికి తెలియడం లేదు. ఎలాంటి చికిత్స అవసరం లేకుండా రోగనిరోధక శక్తి కారణంగా కరోనా నుంచి కోలుకుంటున్నారు. దీంతో కరోనా సోకిన విషయం కానీ.. కోలుకున్న విషయం కానీ వారికి తెలియడం లేదు. ఈ క్రమంలోనే బలమైన రోగ నిరోధక శక్తి కలిగిన 18కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా వ్యతిరేక యాంటీబాడీలు కలిగి ఉన్నారని థైరోకేర్ డేటా తెలిపింది.
దీన్ని బట్టి దేశంలో 15శాతం జనాభాకు కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి వచ్చిందని తేలింది. చాలామందికి కరోనా ను ఎదుర్కొనే బలం ఉన్నా వారికే తెలియడం లేదు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారికి అది వచ్చిపోయిన విషయం కూడా తెలియడం లేదు.