Begin typing your search above and press return to search.

నిజం; ఐన్ స్టీన్ ‘ప్రొఫెసర్’ అర్హత లేదనేశారు

By:  Tupaki Desk   |   29 April 2016 5:08 AM GMT
నిజం; ఐన్ స్టీన్ ‘ప్రొఫెసర్’ అర్హత లేదనేశారు
X
కనీసం చదువుకున్న వారు ఎవరైనా విఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ పేరును విని ఉండటం ఖాయం. మనిషి పరిణామ క్రమాన్ని ఐన్ స్టీన్ ఎంతగా ప్రభావితం చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతటి మహానుభావుడ్ని సైతం సింఫుల్ గా కొట్టిపారేయటమే కాదు.. ఆయన సిద్ధాంతాన్ని సైన్స్ లా కాకుండా ఒక కళాత్మక ఆలోచనగా కొట్టిపారేసిన అంశాన్ని చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు. చరిత్రపుటల్లో దాగిన ఈ ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. మార్పును అంగీకరించిన సమాజం ఎంత కఠినంగా ఉంటుందనటానికి ఇప్పుడు చెప్పే ఉదంతమే చక్కటి నిదర్శనం.

కాంతి స్వభావం.. స్థలకాలాలపై కొన్ని ప్రతిపాదనలు చేసిన ఐన్ స్టీన్ తన డాక్టరేట్ కోసం ఒక అప్లికేషన్ ను 1907లో జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బెర్న్ కు పంపారు. దీనిపై సదరు వర్సిటీ ఒక లేఖను పంపింది. ‘‘ఆనలెస్ దెర్ ఫిజిక్’’ అన్న జర్మన్ సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో ఆసక్తికర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని.. అందులో కాంతి స్వభావం మీద అభిప్రాయాలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది.

అంతేకాదు.. ఐన్ స్టీన్ వ్యక్తం చేసిన భావనలు వాస్తవ భైతిక శాస్త్రం కంటే కళాత్మకంగా ఉన్నట్లుగా తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే ఆయన్ను అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హులు కారన్న విషయాన్ని తేల్చి చెబుతూ లేఖ రాశారు. చిన్నచిన్న ఎదురుదెబ్బలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న వారికి.. చిన్న విషయాలకే విపరీతమైన డిప్రెస్ అయ్యే వారికి తాజా ఉదంతం ఒక చక్కటి పాఠం. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సింఫుల్ గా కొట్టిపారేయటమే కాదు.. ఒక వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత లేదని తేల్చేసిన అవమానం ఎంత పెద్దది. అందుకే.. బాధించే అంశాలు ఎదురైనా.. వాటికి ధీటుగా ఎదురొడ్డి పోరాడాలే కానీ.. పీల్ కావటం ఏమాత్రం సరికాదు.