Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌ను కాల్చి చంపేయాలి : హిందూ ప్ర‌ముఖుడు

By:  Tupaki Desk   |   4 Nov 2017 2:28 PM GMT
క‌మ‌ల్‌ను కాల్చి చంపేయాలి : హిందూ ప్ర‌ముఖుడు
X
హిందూ అతివాదులు తమ మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉగ్రవాదాన్ని ఆసరా చేసుకుంటున్నారని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సృష్టించిన‌ దుమారం కొన‌సాగుతోంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయ‌గా హిందూ మ‌హాస‌భ‌కు చెందిన ఓ నాయ‌కుడు క‌ల‌క‌లం రేకెత్తించే పిలుపు ఇచ్చారు. క‌మ‌ల్ హాస‌న్‌ను కాల్చిచంపాల‌ని అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ‌కు చెందిన సీనియ‌ర్ నేత ఒక‌రు కామెంట్ చేశారు.

హిందూ మ‌తంపై, అతివాదంపై క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ జాతీయ ఉపాధ్య‌క్షుడు పండిట్ అశోక్ శ‌ర్మ స్పందిస్తూ...మ‌త‌ప‌ర‌మైన ఎజెండాలో భాగంగానే...ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హిందూ వ్య‌తిరేక ఎజెండాతో ముందుకు సాగుతున్న నాయ‌కులే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తార‌ని ఆరోపించారు. ఇలాంటి కామెంట్లు చేసే వారికి స‌రైన రీతిలో బుద్ధిచెప్పేందుకు వారిని ఉరితీయ‌డం లేదా కాల్చి చంప‌డం ఒక్క‌టే మార్గం అని వ్యాఖ్యానించారు. క‌మ‌ల్‌కు స‌రైన బుద్ధి చెప్పేందుకు..క‌మల్ హాస‌న్ సినిమాల‌ను బ‌హిష్క‌రించాల‌ని కోరారు. క‌మ‌ల్‌తో పాటుగా ఆయ‌న త‌న‌య శృతి హాస‌న్ న‌టించిన సినిమాల‌ను సైతం వీక్షించ‌వ‌ద్ద‌ని మ‌హాస‌భ పిలుపునిచ్చింది.

మ‌రోవైపు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టులో పరువునష్టం కేసుపై కోర్టు స్వీక‌రించింది. కమల్‌ హాసన్‌పై హిందూ ఉగ్రవాదం అంటూ వ్యాఖ్యలు చేసిన వాద‌న‌ల‌పై ఈ నెల 22న జరుగనుంది. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన అవివేకానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమంది. `హిందువులను కించపర్చుతూ కమల్‌హాసన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఒకవేళ ఆయన దగ్గర ఆధారాలుంటే జాతీయ దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. ఆ ఆరోపణలు నిరాధారం` అని పేర్కొంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హాఫీజ్ సయీద్‌తో కమల్‌హాసన్‌ను పోల్చారు. ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆరెస్సెస్ డిమాండ్ చేసింది. కమల్‌హాసన్ వ్యాఖ్యలకు నటుడు ప్రకాశ్‌రాజ్ మద్దతు తెలిపారు.