Begin typing your search above and press return to search.
ఒక్కరోజే జైల్లో 22మంది హత్య: నివారణకు లాక్‌డౌన్ అమలు
By: Tupaki Desk | 28 April 2020 11:00 PM ISTకరోనాను కట్టడి కోసం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అందరికీ తెలిసిందే. కానీ ఒక జైలులో మాత్రం అక్కడ ఏర్పడిన పరిస్థితులతో జైల్లో కూడా లాక్‌డౌన్ అమలుచేసిన సంఘటన సెంట్రల్ అమెరికాలో చోటుచేసుకుంది. వాస్తవంగా అల్లర్లు, హత్యలు జరిగితే కర్ఫ్యూ విధించడం, 144 సెక్షన్ విధిస్తారు. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌ను ఆయుధంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక జైల్ లో ఒక్కరోజే 22మంది హత్యకు గురయ్యారు. దీంతో జైల్లో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని లాక్‌డౌన్ విధించారు. దీంతో మిగతా ఖైదీలను రక్షించుకునేందుకు లాక్‌డౌన్ దోహదం చేస్తోంది.
సెంట్రల్ అమెరికాలోని ఈఎల్ సాల్విడార్ అనే ప్రాంతంలో ఉన్న ఇజాల్కోలో ఓ జైల్ ఉంది. ఆ జైలులో ఏప్రిల్ 24వ తేదీన ఏకంగా 22 మంది హత్యకు గురయ్యారు. ఆ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న ముఠా నాయకుల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో తరచూ వివిధ గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ క్రమంలోనే ఒక్కసారిగా 22మంది హత్య చేసేలా పరిస్థితులు చేరాయి. దీనిపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్‌లే ఇజాల్కోలోని జైల్‌లో 24 గంటల పాటు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయించారు.
ఎల్ సాల్విడార్‌లో వీధి రౌడీల మధ్య గొడవలు సర్వసాధారణం. వాటికి అక్కడ పేరు మరాస్‌లని ఉండేది. వారి గొడవలతో ఎంతోమంది బలయ్యేవారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా నయీబ్ వచ్చాక వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ ముఠా నాయకులందరినీ అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. ఇప్పుడు పరిస్థితి మారి కొన్ని నెలలుగా ఒక్క హత్య కూడా జరగలేదు. అయితే ఇప్పుడు బయట కాకుండా జైలు లోపల ఒకే రోజు 22 మంది హత్యకు గురికావడం సంచలనంగా మారింది.
వెంటనే స్పందించిన ప్రభుత్వం జైల్‌లో లాక్‌డౌన్ విధించారు. జైల్లో ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా అందరిని ఒకే చోట ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా నిర్బంధించారు. హత్యలపై విచారణ సాగుతోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించే విషయం విస్మరించడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.