Begin typing your search above and press return to search.
నిర్దోషిగా కోర్టు తీర్పు.. ఆనందం పట్టలేక కోర్టులోనే మృతి!
By: Tupaki Desk | 21 Oct 2022 6:17 AM GMTమనదేశంలో ఏళ్ల తరబడి కోర్టు కేసులు నడుస్తుంటాయి. ఈ లోపు నిందితులు, పిటిషనర్లు కూడా మరణిస్తుంటారు. కానీ కేసులు మాత్రం ఎంతకూ తేలవు. అలాగే కొన్ని కేసుల్లో నిర్దోషులు ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటారు.
చివరకు కోర్టు విచారణ అంతా పూర్తి చేసి వారు నిర్దోషులు విడుదల చేసే సరికి పుణ్యకాలం పూర్తయి జీవిత కాలంలో అత్యధిక భాగం జైలులోనే మగ్గిపోయి ఉంటారు. అప్పుడు కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చినా అతడి జీవితమంతా వ్యర్థమే అవుతుంది.
ఇప్పుడు ఇలాంటి ఘటనే బిహార్‌లో సంచలనం సృష్టించింది. బిహార్‌లో 26 ఏళ్లుగా తాను నిర్దోషినంటూ ఒక వ్యక్తి కోర్టులో న్యాయ పోరాటం చేశాడు. ఎట్టకేలకు అతడి న్యాయ పోరాటం ఫలించింది. కోర్టు అతడికి అనుకూలంగా నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. అయితే అతడు ఆ ఆనందాన్ని పట్టలేకపోయాడు. న్యాయమూర్తి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వగానే అక్కడే కుప్పకూలి మరణించాడు.
ఈ విషాద ఘటన బిహార్‌లోని బెల్‌హర్ ఠాణా పరిధిలోని ఝుంకా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాగోసింగ్, మరో ఐదుగురిపై 1996లో పంటను తగులబెట్టిన అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులంతా కొంతకాలం విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
తాజాగా ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారు. తీర్పు విన్న నాగోసింగ్ (76).. ఆనందాన్ని పట్టలేక కోర్టులోనే కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగోసింగ్ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.
దీంతో కోర్టుకు వచ్చిన సహ నిందితులతోపాటు న్యాయవాదులు, వివిధ కేసులపై కోర్టుకు వచ్చినవారు సైతం నాగోసింగ్ ఉదంతాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న ఆ ఆనందం ఆయనకు ఎక్కువసేపు నిలవలేదని విచారం వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.