Begin typing your search above and press return to search.
అక్కకి కరోనా ..చెల్లి తీన్మార్ డ్యాన్స్ !
By: Tupaki Desk | 20 July 2020 12:39 PM GMTకరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిపోయేలా చేస్తున్న ఈ మహమ్మారికి అంతం ఎప్పుడో అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఎన్నో దేశాలు ఈ కరోనా కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఈ కరోనా జోరు రోజురోజుకి పెరుగుతూనే పోతుంది తప్ప .. తగ్గుముఖం పట్టినట్టు ఎక్కడా కనిపించడం లేదు. రోజు లక్షల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 45 లక్షలు దాటిపోయింది. అలాగే మరణాల సంఖ్య కూడా ఆరు లక్షలు దాటిపోయింది. ఇకపోతే ఈ మహమ్మారి మన దేశంలో కూడా విలయతాండవం చేస్తుంది. దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటింది. అలాగే తాజాగా ఒక్కరోజులోనే 40 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే , కరోనా సోకి హాస్పిటల్ లో చికిత్స తీసుకోని కరోనా పై విజయం సాధించినవారు యుద్ధంలో గెలించినట్టుగా ఇంటికి రాగానే పార్టీలతో హోరెత్తిస్తున్నారు. కరోనా నుండి కోలుకుని కొంతమంది పార్టీలు ఇస్తుండగా మరి కొందరు వీధుల్లో చిందులేస్తున్నారు. తాజాగా పుణే లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఓ యువతికి కొద్దిరోజుల కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆమెని హాస్పిటల్ కి తరలించి .. ఆమె నివసిస్తున్న ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే , తాజాగా ఆ యువతి కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ను జయించి ఇంటికి తిరిగి వస్తున్న అక్కను చూసి ఆమె చెల్లెలు ఆనందం తట్టుకోలేక వీధిలోనే తీన్మార్ స్టెప్పులు వేసి అక్కకి స్వగతం పలికింది. చెల్లెలి ఆనందం చూసి అక్క కూడా ఓ కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.