Begin typing your search above and press return to search.

లేటు వయసు లో ఘాటు ప్రేమ

By:  Tupaki Desk   |   30 Dec 2019 11:18 AM GMT
లేటు వయసు లో ఘాటు ప్రేమ
X
ప్రేమ గుడ్డిది.. మూగది.. చెవిటిది.. ఇలా కవులు ఎన్నో రకాలు తమ భావ వ్యక్తీకరణను వ్యక్తీకరిస్తూనే ఉంటారు. ప్రేమలో ఉండేవాళ్లు.. మాత్రం ‘ప్రేమ గురించి మీకు ఏం తెలుసు’ అంటూ ప్రేమించనోళ్లను ప్రశ్నిస్తుంటారు. ఇక మన సినిమాల్లో అయితే ప్రేమ ఎలా పుడుతుందో.. ఎలా అంతమవుతుందో తెలియని పరిస్థితి.

ప్రేమకు హద్దు లేదు.. వయసు లేదంటారు.. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కేరళలో నివసించే ఓ వృద్ధ జంట మనసులు కలిశాయి. దాదాపు 100 ఏళ్లు దగ్గరవుతున్న ఈ ముసలి జంట ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది.

21 ఏళ్ల క్రితం భర్త చని పోవడంతో లక్ష్మీ అమ్మాల్ అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త దగ్గర అసిస్టెంట్ గా 30 ఏళ్ల క్రితం చనిపోయిన మేనన్ తో పరిచయం ఉంది. వృద్ధురాలు అయిపోయిన లక్ష్మీ వృద్ధాశ్రమంలో ఉంటోంది. అక్కడే వృద్ధాశ్రమం లో ఉంటున్న మేనన్ చూసి గుర్తుపట్టింది. ఇద్దరి మనసులు కలిశాయి. వృద్ధాప్యం లో తోడుగా ఉందామని అనుకొని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి కేరళ మంత్రి కూడా హాజరయ్యారు. ఈ తాత అమ్మలను ఆశీర్వదించారు. లేటు వయసు లో ఘాటు పెళ్లి చేసుకున్న వీరి ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.