Begin typing your search above and press return to search.

పవన్‌ కల్యాణ్‌ సినిమాలను కూడా ఆపేస్తారా ఏంటి.?

By:  Tupaki Desk   |   21 March 2019 1:30 AM GMT
పవన్‌ కల్యాణ్‌ సినిమాలను కూడా ఆపేస్తారా ఏంటి.?
X
ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని చూసి మనం ఫుల్‌ గా ఎంజాయ్ చెయ్యాలే తప్ప లాజిక్‌ అడకకూడదు. ఇప్పుడు అలాంటిదే ఒక విచిత్రం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని మండ్యా నుంచి హీరోయిన్ సుమలత పోటీకి దిగుతున్నారు. యాక్చువల్‌ గా ఈ నియోజకవర్గం ఆమె భర్త అంబరీష్‌ ప్రాతినిధ్య వహించిందే. కానీ ఆయన చనిపోవడంతో. ఆయన ప్లేస్‌ లో సుమలత పోటీకి దిగారు. కానీ జేడీఎస్‌కు ఆ సీటుని వదులుకోవడం ఇష్టం లేదు. దీంతో.. దేవగౌడ మనవడు - ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖౌల్‌ గౌడ మండ్య నుంచి పోటీకి దిగాడు. అప్పుడే ప్రచారం స్టార్ట్‌ చేశారు. పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నారు.

మరి అటు సుమలత - ఇటు నిఖిల్‌ గౌడ పరస్పర ఆరోపణలను చూసిన ఎన్నికల కమిషన్‌కు ఏం అన్పించిందో తెలీదు కానీ తాము ఒకరం ఉన్నామని చెప్పేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా సుమలత - నిఖిల్‌ నటించిన సినిమాలు వేటినీ దూరదర్శన్‌ చానెల్స్‌ ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ విషయం మన రాష్ట్ర ఎన్నికలు అధికారులు విన్నారో లేదో. ఎందుకంటే.. విని ఉంటే ఇప్పుడు రెండు నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్‌ కల్యాణ్‌ సినిమాల్ని కూడా ఆపేయమని ఆదేశాలు ఇస్తారు. అయినా వారి పిచ్చి నమ్మకం కానీ.. కేబుల్‌ టీవీ - డీటీహెచ్‌ లు - అమెజాన్‌ - హాట్‌ స్టార్‌ లాంటివి వచ్చిన తర్వాత కూడా జనం ఇంకా దూరదర్శన్‌ చానెల్ చూస్తున్నారా చెప్పండి. ఏదో ఇలా అవకాశం ఉన్నప్పుడైనా తమ అధికారాన్ని చూపించుకోవాలని కొంతమంది అధికారుల తాపత్రయం తప్ప.. అంతకుమించి ఏం ఉండదు.