Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత .. ఆ 372 పంచాయతీల్లో కొనసాగింపు !

By:  Tupaki Desk   |   11 March 2021 10:45 AM GMT
ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత .. ఆ  372 పంచాయతీల్లో కొనసాగింపు !
X
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీనితో ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు మొదలుపెట్టింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను తొలగించింది. అలాగే కార్పోరేషన్లలో మేయర్‌, డిప్యూటీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నేడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. అయితే కొన్ని చోట్ల ఎన్నికలు పెండింగ్‌లో ఉండటం, పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ను మాత్రం ఎస్ ఈ సీ తొలగించలేదు. అయితే , నేడుపంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ ఎత్తేస్తే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు.

అయితే, ఇంకా ఎన్నికలు జరగాల్సిన 372 పంచాయతీల్లో మాత్రం ఎన్నికల కోడ్‌ కొనసాగుతుంది అని తెలిపారు. గతంలో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడంతో ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తదుపరి ప్రక్రియపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. ఓవైపు ఈ నెల 14న జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఎస్ ఈసీ, మరోవైపు కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను ఆయా కార్పోరేషన్ల పాలకమండళ్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా నియమించారు.