Begin typing your search above and press return to search.
17మంది తెలుగు ఎంపీలకు ఈసీ షాక్
By: Tupaki Desk | 4 Feb 2020 9:26 AM GMTమొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ మన తెలుగు ఎంపీలు చేతికి ఎముకే లేకుండా డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టి గెలిచారు. ఎన్నికల కమిషన్ విధించిన పరిమితిని మించి అనధికారికంగా కోట్లు ఖర్చు పెట్టారు. అయితే గెలిచిన 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుకు సంబంధించిన లెక్కలను ఈసీకి సమర్పించాలి. కానీ ఇప్పటివరకూ 17మంది తెలుగు ఎంపీలు లెక్కలు చెప్పలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 80మంది ఎంపీలు ఇలానే ఈసీకి లెక్కలపై అఫిడవిట్ సమర్పించలేదు.
దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కొరఢా ఝలిపించింది. ఎన్నికల ఖర్చు ఫైల్ చేయకుండా ఎన్నికను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. తమకు చర్యలు తీసుకునే హక్కు ఉందని.. వెంటనే ఎన్నికల ఖర్చు సమర్పించాలని ఎంపీలకు అల్టిమేటం జారీ చేసింది.
అయితే కోట్లలో ఖర్చు చేసిన ఎంపీలు ఇప్పుడు ఈసీ పరిమితికి లోబడి ఎలా అఫిడవిట్లు దాఖలు చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. తమ అధిక ఖర్చుల విషయం బయట పడుతుందనే భయం ఎంపీల్లో నెలకొంది.