Begin typing your search above and press return to search.
గుజరాత్ లో 'పప్పు' పై బ్యాన్ !
By: Tupaki Desk | 15 Nov 2017 8:10 AM GMTఅమూల్ బేబి - పప్పు.. ఇవన్నీ బీజేపీ దాని మిత్రపక్షాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఊహించని విధంగా ఊరట లభించింది. అయితే త్వరలో గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ యువరాజును అలా అనకూడదని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అంతేకాదు రాహుల్‌ను ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో సైతం ‘పప్పు’ అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది.
గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఎలక్ట్రానిక్ ప్రచార కార్యక్రమంలో రాహుల్‌ను ఉద్దేశించి ’పప్పు’ పదాన్ని వినియోగించడానికి అనుమతి కోరుతూ బీజేపీ ఈసీకి స్క్రిప్టు పంపింది. దానిని పరిశీలించిన కమిషన్‌కు చెందిన కమిటీ ‘పప్పు’ అనే పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ నాయకుడిని అలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈసీ నిర్ణయంపై స్పందించిన గుజరాత్ బీజేపీ వర్గాలు అడ్వర్టైజ్‌మెంట్‌లో వాడిన స్క్రిప్ట్ ఏ నాయకుడినీ ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి.
ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన స్క్రిప్టును ముందుగానే గుజరాత్ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఉండే మీడియా కమిటీకి అందజేస్తామని తెలిపాయి. అలా స్క్రిప్టును పరిశీలించిన కమిటీ సభ్యులు ‘పప్పు’ అనే పదాన్ని తొలగించాలని కోరినట్లు వెల్లడించాయి. త్వరలోనే సరికొత్త స్క్రిప్టును ఈసీకి అందజేస్తామని తెలిపాయి. ఏది ఏమైనా ఈసీ నిర్ణయం రాహుల్‌కు అనుకోకుండా ఊరట కలిగించినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.