Begin typing your search above and press return to search.
'చౌకీ దార్ చోర్ హై' పై ఈసీ బ్యాన్!
By: Tupaki Desk | 19 April 2019 4:48 AM GMTమై చౌకీదార్ అంటూ ప్రధాని మోడీ గొప్పగా చెప్పుకోవటమే కాదు.. బీజేపీ పరివారం గడిచిన కొద్ది కాలంగా చౌకీదార్ పేరుతో నడుపుతున్న ఉద్యమం సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేరు పక్కనే చౌకీదార్ పేరుతో తమను విమర్శించే వారికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేయటం తెలిసిందే. మై చౌకీదార్ అంటూ మోడీ నినాదాన్ని.. అంతే తీవ్రంగా చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేయటం తెలిసిందే.
తాను పాల్గొనే ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ ‘చౌకీ దార్ చోర్ హై’అంటూ రాహుల్ విరుచుకుపడటం.. దీనికి భారీగా రెస్పాన్స్ రావటం తెలిసిందే.
దేశాన్ని రక్షకుడ్ని నేనే అని మోడీ అంటే.. రక్షకుడు కాదు దొంగ అంటూ రాహుల్ విరుచుకుపడుతున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ పాల్గొనే సభల్లో ‘చౌకీ దార్ చోర్ హై’అనే మాటను అదే పనిగా ప్రసంగిస్తుండటం.. దానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ బీజేపీ వర్గాల్లో కొత్త టెన్షన్ కు కారణంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది.
తాజాగా మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక వీడియోను విడుదల చేసింది. దానికి ‘చౌకీ దార్ చోర్ హై’ అన్న పేరుతో రిలీజ్ చేశారు. దీనిపై తనకు అందిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఈ వీడియోపై బ్యాన్ పెడుతున్నట్లుగా పేర్కొంది. తక్షణమే ఈ వీడియోను నిలిపివేయాలని కోరింది.
దేశానికి కాపలాదారుడ్ని అంటూ మోడీ మాటల్ని వక్రీకరిస్తూ.. ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించేందుకే ఈ వీడియోను రూపొందించినట్లుగా బీజేపీ చెబుతోంది. మోడీ అస్త్రాన్ని కాస్త మార్చి తిరిగి దాన్నే సంధించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
తాను పాల్గొనే ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ ‘చౌకీ దార్ చోర్ హై’అంటూ రాహుల్ విరుచుకుపడటం.. దీనికి భారీగా రెస్పాన్స్ రావటం తెలిసిందే.
దేశాన్ని రక్షకుడ్ని నేనే అని మోడీ అంటే.. రక్షకుడు కాదు దొంగ అంటూ రాహుల్ విరుచుకుపడుతున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ పాల్గొనే సభల్లో ‘చౌకీ దార్ చోర్ హై’అనే మాటను అదే పనిగా ప్రసంగిస్తుండటం.. దానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ బీజేపీ వర్గాల్లో కొత్త టెన్షన్ కు కారణంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది.
తాజాగా మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక వీడియోను విడుదల చేసింది. దానికి ‘చౌకీ దార్ చోర్ హై’ అన్న పేరుతో రిలీజ్ చేశారు. దీనిపై తనకు అందిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఈ వీడియోపై బ్యాన్ పెడుతున్నట్లుగా పేర్కొంది. తక్షణమే ఈ వీడియోను నిలిపివేయాలని కోరింది.
ఈ వీడియోను ఎక్కడా ప్రదర్శించొద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయటంతోపాటు.. మధ్యప్రదేశ్ అదనపు ఎన్నికల అధికారితో పాటు.. జిల్లాల అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని.. అందుకు తగ్గట్లు కాంగ్రెస్ పైన కేసులు నమోదు చేయనున్నట్లుగా చెబుతున్నారు.