Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఈసీ షాక్..!
By: Tupaki Desk | 6 Oct 2018 10:30 AM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్ పై నేడు ఎలక్షన్ కమిషన్ తీసుకోబోతున్న నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ - మిజోరాం లతో పాటు తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను నేడు ఈసీ వెల్లడించనున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే, తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో కేసు తీర్పు వెలువడిన తర్వాత తెలంగాణ షెడ్యూల్ వెల్లడిస్తారని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సర్కార్ కు ఈసీ షాకిచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్ - మిజోరాం రాష్ట్రాలలో డిసెంబరు 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ను హైకోర్టు తీర్పు అనంతరం ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో పలు కేసులు పెండింగ్ లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. తాజాగా ఈసీ నిర్ణయంతో తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, తెలంగాణలో ఓటర్ల జాబితా అక్టోబర్ 8వ తేదీన విడుదల కావాల్సి ఉంది. హైకోర్టులో ఆ జాబితాపై కేసు వేయడంతో ఈ నెల 12న ఆ జాబితా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉన్నా....ఓటర్ల జాబితా విడుదలయ్యాకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ముందస్తుపై జోరు మీదున్న కేసీఆర్ కు ఈసీ తాజా నిర్ణయం షాకిచ్చిందని చెప్పవచ్చు.