Begin typing your search above and press return to search.
ఎన్నికల సంఘం ఏపీలో, తెలంగాణలో గుర్తింపు రద్దు చేసిన పార్టీలివే!
By: Tupaki Desk | 14 Sep 2022 5:01 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆరు రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వాటి గుర్తింపును, ఎన్నికల గుర్తులను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీ (ఆర్‌యూపీపీ)లను తన జాబితా నుంచి తొలగించింది. అదేవిధంగా తెలంగాణలో 14 ఆర్‌యూపీపీలను క్రియాశీలకంగా లేని పార్టీలుగా ప్రకటించింది.
ఇక దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తెస్తానని చెప్పుకునే కేఏ పాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీని క్రియాశీలకంగా లేని పార్టీగా ప్రకటించింది.
మే 25న ఆర్‌యూపీపీల విధివిధానాలను అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా 86 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఇక ఉనికిలో లేని 253 పార్టీలను క్రియారహిత ఆర్‌యూపీపీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఉనికిలో లేని పార్టీల సంఖ్య 537కి చేరింది.
అలాగే ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన ఆర్‌యూపీపీల సంఖ్య 284కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణతో పాటు బిహార్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 253 నాన్-కంప్లైంట్ ఆర్‌యూపీపీలను క్రియారహిత పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించింది.
ఇలాంటి పార్టీలు ఎన్నికల్లో పోటీచేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా వివిధ ప్రయోజనాలను పొందుతున్నాయని తెలిపింది. తద్వారా ఎన్నికల ముందు రాజకీయ లబ్ధిని పొందుతున్నాయని పేర్కొంది. ఈ క్రియారహిత పార్టీలు ఎన్నికల్లో పోటీచేస్తున్న రాజకీయ పార్టీలతోపాటు ఓటర్లను కూడా గందరగోళంలో పడేస్తున్నాయని గుర్తించింది.
వాస్తవానికి పార్టీ రిజిస్టర్ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండాలి. పార్టీ ఆరేళ్లపాటు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయకపోతే రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి ఆ పార్టీని తొలగిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన పార్టీలు... ఆల్ ఇండియా ముత్తాహిదా ఖ్వామీ మహాజ్, భారత్‌దేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ధి సేవా సమూహం, మన పార్టీ, ప్రజాభారత్ పార్టీ.
ఇక తెలంగాణలో ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిన పార్టీలు.. సెక్యులర్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా, సురాజ్ పార్టీ ఉన్నాయి. తెలంగాణలో 14 క్రియారహిత పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ తదితరాలున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.