Begin typing your search above and press return to search.
ఓటర్ల మనసులో భలేగా రిజిష్టర్ అయ్యేలా మాట్లాడాడే!
By: Tupaki Desk | 18 April 2019 5:35 AM GMTఎన్నికల వేళ.. నేతల నోటి నుంచి చిత్ర విచిత్రమైన మాటలు వస్తుంటాయి. ఓటర్ల దృష్టి తమ మీద పడటానికి.. తమ వ్యాఖ్యలు వారి మనసుల్లో రిజిస్టర్ కావటానికి వారు పడే తపన అంతా ఇంతా కాదు. ఆ ప్రయత్నంలో లక్ష్మణ రేఖల్ని దాటేస్తుంటారు.
తాజాగా అలాంటి పనే చేశారు ఛత్తీస్ గఢ్ ఎక్సైజ్.. వాణిజ్యం.. పరిశ్రమ శాఖామంత్రి కవాసి లక్మా. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు.. ఎన్నికల సంఘం సైతం స్పందించింది. ఇంతకీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటంటే.. ఓటేసేటప్పుడు ఈవీఎంలలో మొదటి బటన్ మాత్రమే నొక్కాలని.. లేకుంటే షాక్ తగులుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో మొదటి మీట కాకుండా వేరేదినొక్కితే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందంటూ వార్నింగ్ ఇచ్చిన లక్మా మాటలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలలో కాంగ్రెస్ పార్టీ బటన్ మొదట ఉంది. దీంతో.. ఆయన కాంగ్రెస్ కు తప్ప వేరే పార్టీకి ఓటు వేసే ప్రయత్నం చేస్తే.. షాక్ తగులుతుందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మొదటి బటన్ తప్పించి.. రెండో బటన్ నొక్కినా.. అందులో ఉండే కరెంటుతో మీకు షాక్ తగులుతుందన్న ఆయన.. మూడో మీట నొక్కినా అలానే షాక్ కొడుతుందని వ్యాఖ్యానించటం విశేషం. రెండో దశ పోలింగ్ కు ఒక రోజు ముందు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.