Begin typing your search above and press return to search.

శ‌శిక‌ళ‌కు భారీ షాక్: ఈసీ అభ్యంతరాలు

By:  Tupaki Desk   |   8 Feb 2017 10:15 AM GMT
శ‌శిక‌ళ‌కు భారీ షాక్: ఈసీ అభ్యంతరాలు
X
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఆశపడుతున్న శశికళకు వరుసగా ఒకదాని మీద మరో షాక్ తగులుతున్నాయి. పార్టీ నేతలంతా ఆమెను సీఎంగా ఎన్నుకున్నాక పన్నీర్ సెల్వం అడ్డం తిరగడం తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోవడం.. వ్యవహారం చక్కబెట్టుకుని సీఎం కుర్చీలో కూర్చోవడం ఎలాగా అని ఆలోచిస్తున్న శశికళకు మరో షాక్ తగిలింది. అది.. ఎన్నికల సంఘం నుంచి. అయితే.. లక్కీగా అది సీఎం పదవికి సంబంధించింది కాకపోవడంతో శశికళ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అన్నా డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - అప్పటి సీఎం జ‌య‌ల‌లిత మృతి అనంత‌రం నెల‌రోజుల‌కే హ‌డావుడిగా స‌మావేశం ఏర్పాటు చేసి, తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శశికళను ఎన్నుకోవ‌డం ప‌ట్ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఘాటుగా స్పందించింది. అంత హ‌డావుడిగా ఎందుకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నుకున్నార‌ని ప్ర‌శ్నించింది. అస‌లు అన్నాడీఎంకే నియ‌మావ‌ళిలో తాత్కాళిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి లేదంటూ వ్యాఖ్యానించింది. అలాంట‌ప్పుడు ఆ ఎన్నిక ఎలా చేప‌డ‌తారని ప్ర‌శ్నించింది. దీనికి అన్నాడీఎంకే నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

మరోవైపు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం తిరుగుబాటు చేయ‌డంతో శశికళ ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు 130 మంది పార్టీ ఎమ్మెల్యేల‌తో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో స‌మావేశం అయ్యారు. ప‌న్నీరు సెల్వం వెనుక స్టాలిన్ ఉన్నట్లు ఆమె అన్యాపదేశంగా ఆరోపించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/