Begin typing your search above and press return to search.
ఈసీకి చెమటలు పట్టిస్తున్న నిజామాబాద్!
By: Tupaki Desk | 2 April 2019 4:47 AM GMTసినిమాల్లో మాత్రమే కనిపించే సీన్.. నిజ జీవితంలో ఎదురు కావటం అరుదైన సంగతే. కడుపు మండిన అన్నదాత కసిగా ఎన్నికల బరిలో నిలవటం.. లాంటి కాన్సెప్ట్ లు రీల్ కు బాగా సూట్ అవుతాయి. కానీ.. రీల్ కు మించి రియల్ గానే నిజామాబాద్ కు చెందిన పసుపు.. ఎర్రజొన్నల రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం కొత్త తరహాలో చేపట్టిన కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలోని 16 ఎంపీ స్థానాలకు భిన్నమైన పరిస్థితులు నిజామాబాద్ ఎంపీ స్థానంలో నెలకొన్నాయి. తమ కష్టాలు కేంద్రానికి తెలిసేలా.. దేశ ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో అక్కడి రైతులు సక్సెస్ అయ్యారు. భారీగా ఎత్తున రైతులు ఎన్నికల బరిలోకి దిగటంతో మొత్తంగా 185 మంది ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో.. ఇక్కడ పోలింగ్ ఎలా నిర్వహించాలన్నది సమస్యగా మారింది. తొలుత బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ కార్యక్రమాన్ని పూర్తి చే్ద్దామని భావించారు. ఇందుకు అవసరమైన పనుల జాబితాను సిద్ధం చేశారు.
అయితే.. ఎన్నికను వాయిదా వేయటం.. పోలింగ్ కు అవసరమైన బ్యాలెట్ పత్రం భారీగా.. న్యూస్ పేపర్ అంత పెద్దదిగా ప్రింట్ చేయాల్సి రావటంతో పాటు.. అంత పెద్ద పేపర్ ను పెట్టేందుకు వీలుగా ఉండాల్సిన భారీ ఎత్తున టేబుళ్లు.. సరంజామాను సిద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో.. ఎన్నికను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. నిజామాబాద్ పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా అర్థరాత్రి వరకూ సమావేశాల్ని నిర్వహించాల్సి వస్తోంది.
మిగిలిన చోట్ల మాదిరి కాకుండా నిజామాబాద్ లో ఎం3 ఈవీఎంలను వినియోగించాలని భావిస్తున్నారు. అయితే.. ఇక్కడ వచ్చిన ప్రాక్టికల్ సమస్య..పోలింగ్ అవసరమైన ఈవీఎంలను ఎలా సెట్ చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై భారీ ఎత్తున కసరత్తు చేసిన ఈసీ చివరకు ఒక సొల్యూషన్ ను తెర మీదకు ఈసీ తెచ్చినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి జరిగే పోలింగ్ లో 12 ఈవీఎం యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. అయితే.. వీటిని వరుసగా ఉంచితే.. ఓటు వేయటానికి వచ్చే ఓటర్ కు కొత్త సందేహాలు రావటమే కాదు.. తాను ఓటు వేయాలనుకున్న వారెవరన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికే సమయం సరిపోతుంది.
అంతేకాదు.. వరుస క్రమంలో ఈవీఎంలను ఉంచితే.. ఎవరు ఏ వైపునకు వెళ్లారు? ఎవరికి ఓటు వేశారన్న విషయంపైనా ఒక అవగాహన రావటం ఖాయం. అదే జరిగే రహస్య బ్యాలెట్ అన్న మాటకు విలువ లేకుండా పోతుంది. అందుకే.. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఈవీఎంలను యూ ఆకారంలో ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. దీంతో.. యూ ఆకారంలో సెట్ చేసిన ఈవీఎంలలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 185 మందిలో తమకు నచ్చిన వారికి ఓటు వేసిన తర్వాత.. తాము వేసిన అభ్యర్థికే ఓటు పడిందా? లేదా? అన్నది మాత్రం ఎప్పటిలానే ఏడు సెకన్ల వ్యవధిలోనే చూడాల్సి ఉంది. ఏమైనా నిజామాబాద్ ఎన్నికల పుణ్యమా అని ఎన్నికల సంఘం అధికారులకు తాజా ఎన్నిక చుక్కలు కనిపించేలా చేస్తున్నట్లు చెబుతున్నారు.