Begin typing your search above and press return to search.
ల్యాప్ ట్యాప్ -ఏసీ..ఏది కావాలన్నా ఈసీ ఇచ్చేస్తుంది
By: Tupaki Desk | 29 Sep 2019 4:13 PM GMTఎయిర్ కండీషనర్ - ల్యాప్ ట్యాప్ - వాక్యూమ్ క్లీనర్ - క్యాప్సికం...ఇవన్నీ ఎన్నికల కమిషన్ మనకు ఇస్తుందట! ఎన్నికల కమిషన్ ఏంటి...ఈ వస్తువులు ఏంటి...మనకు ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా...వచ్చే నెల 21న మహారాష్ట్ర - హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్య్ర అభ్యర్థుల కోసం ఈసీ 197 రకాల ఎన్నికల గుర్తులను కేటాయించనుంది. ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటున్న స్వతంత్య్ర అభ్యర్థులు సుదీర్ఘమైన ఈ ఎన్నికల చిహ్నాల జాబితాలోంచి మూడు గుర్తులను ఎంపిక చేసుకుంటే - ఈసీ వాటిలోంచి ఓ గుర్తును కేటాయిస్తుందన్నమాట!
ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ - కేటాయింపు) ఆర్డర్ - 1968 ప్రకారం.. పోటీచేసే అభ్యర్థులకు చిహ్నాలను ఈసీ కేటాయిస్తుంది. రిజిస్టర్ అయిన పార్టీలు ఇప్పటికే రిజర్వు చేసిన చిహ్నాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 'చేతి' గుర్తును కాంగ్రెస్ కు - కమలం గుర్తును బీజేపీకి ఈసీ రిజర్వ్ చేసింది. ఈ గుర్తులను ఇతర పార్టీలు ఉపయోగించలేవు. ఈసీ నుంచి ఒకే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలూ ఇతర రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన గుర్తులను ఉపయోగించుకోవడానికి రిజర్వ్ చేసుకోవచ్చు. పార్టీ టికెట్ ద్వారా పోటీ చేసేవారు కాకుండా మిగతా ఎవరైనా ఈ గుర్తులను ఎంచుకోవచ్చు. ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి పాత వస్తువుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన గాడ్జెట్ల దాకా ఎన్నికల చిహ్నాల జాబితాలో ఉన్నాయి. ఉదాహరణకు - ఒకప్పటి రుబ్బురోలు.. గ్రైండర్ - ఎయిర్ కండీషనర్ - వాక్యూమ్ క్లీనర్ - ల్యాప్ టాప్ వంటి గాడ్జెట్ లతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. పలకడానికి సులభంగా ఉండే అగ్గిపెట్టె - మైక్ వంటి చిహ్నాలూ ఉన్నాయి.
ఇదిలాఉండగా - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ-శివసేన పార్లీల మధ్య సీట్ల పంపకంపై తుది చర్చలు జరుగుతున్న సమయంలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు శివసేనకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని తాను తన తండ్రి బాల్‌థాక్రే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. బీజేపీతో కూటమి కార్యరూపం దాల్చిన తరువాత అధికారం విషయంలో వెన్నుపోటు పొడిచే అలవాటు తమకు లేదని, ఏదైనా ఉంటే బహిరంగంగానే మాట్లాడుతామని అన్నారు. సీనియర్ నేతలు, టికెట్ ఆశావహులతో బంద్రా పట్టణంలో శివసేన పార్టీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఉద్దవ్‌థాక్రే మాట్లాడుతూ రాష్ట్రంలో శివసేన అధికారంలోకి రావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇదే విషయంపై తాను తన తండ్రికి హామీ ఇచ్చానని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.