Begin typing your search above and press return to search.
వీవీ ప్యాట్లపై బాబు పోరు.... ఈసీ లైట్ తీసుకుందే
By: Tupaki Desk | 21 May 2019 5:42 PM GMTటీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎన్నిలక ఫలితాల ముంగిట వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తన ప్రమేయంతోనే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన వీవీ ప్యాట్లపై చంద్రబాబు చేస్తున్న పోరాటం ఎందుకూ కొరగాకుండా పోతోందని చెప్పక తప్పదేమో. ఎందుకంటే... అందివచ్చిన టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పిన చంద్రబాబు... ఈవీఎంల ప్రవేశానికి కూడా తానే ఆద్యుడనని చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎదురు తన్నుతున్న వేళ... అవే ఈవీఎంలపై ఇప్పుడు బాబు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనని కోరుతున్న చంద్రబాబు... తన డిమాండ్ కు మద్దతుగా 21 పార్టీలను కూడగట్టారు.
ఈ పార్టీలతో కలిసి ఆయన మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందు 21 పార్టీల నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన చంద్రబాబు... ఈసీ వద్ద ఏఏ అంశాలను ప్రస్తావించాలన్న అంశంపై మంతనాలు సాగించారు. ఆ తర్వాత అందరినీ వెంటేసుకుని నిర్వచన్ సదన్ కు వెళ్లిన చంద్రబాబు సీఈసీ సునీల్ అరోరాతో భేటీ అయ్యారు, సుదీర్ఘంగా తమ వాదనను వినిపించారు. కౌంటింగ్ లో తొలుత ర్యాండమ్ గా ఎంపిక చేసిన ఐదు బూత్ ల ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను కూడా లెక్కించాలని, వాటిలో తేడా వస్తే... మొత్తం నియోజకవర్గంలోని అన్ని వీవీ ప్యాట్లను కూడా లెక్కించాలని ఆయన తన అంతిమ డిమాండ్ ను వినిపించారు.
ఈ వాదనంతా విన్న అరోరా... చాలా సింపుల్ గా ఇప్పటికిప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని, బుధవారం తాము ఓ సారి భేటీ అయి ఈ వినతి మీద చర్చిస్తామని తెలిపారు. ఏ ప్రతిపాదన మీద అయినా వినతి వస్తే స్వీకరిస్తామని చెప్పిన అరోరా... వాటిపై నిర్ణయాలను మాత్రం కమిషన్ లో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే తీసుకుంటామని తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన చంద్రబాబు... మిత్రపక్షాలతో కలిసి బయటకు వచ్చేశారు. అక్కడే ఆయన కోసం వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడుతూ... తమ డిమాండ్ పై ఈసీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఓ వింత వాదనను వినిపించారు. ఒక్క రక్తం చుక్కకు కేన్సర్ సోకినా... శరీరం మొత్తం వ్యాపిస్తుందని, అలాగే... శాంపిల్ కౌంటింగ్ లో తేడా వస్తే... మొత్తం తేడా వచ్చేసినట్టేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎన్నికల కౌంటింగ్ ముందు కూడా చంద్రబాబుకు ఎదురు దెబ్బే తగులుతుంది.