Begin typing your search above and press return to search.

చెన్నైలో ఈసీ బ్యాచ్‌!...దిన‌క‌ర‌న్‌ కు షాకేనా?

By:  Tupaki Desk   |   26 Jan 2018 12:46 PM GMT
చెన్నైలో ఈసీ బ్యాచ్‌!...దిన‌క‌ర‌న్‌ కు షాకేనా?
X
త‌మిళ‌నాట మ‌రో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి రంగం సిద్ధ‌మైంది. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం - అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీ నియోజక‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో చిన్న‌మ్మ శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్ విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీటును ద‌క్కించుకునేందుకు అమ్మ వార‌సులుగా ప్ర‌భుత్వాన్ని - పార్టీని న‌డిపిస్తున్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి - ఓ ప‌న్నీర్ సెల్వం భారీ క‌స‌ర‌త్తే చేశారు. అయితే అన్నాడీఎంకేతో పాటుగా త‌మిళ సీఎం పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేసిన శ‌శిక‌ళ‌.. జైలు కెళ్ల‌గా... ఆమె మేన‌ల్లుడి హోదాలో రంగంలోకి దిగిపోయిన టీవీవీ దిన‌క‌ర‌న్‌... ఓపీఎస్‌ - ఈపీఎస్‌ ల‌కు చుక్క‌లు చూపార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో హోరాహోరీగా సాగుతుంద‌నుకున్న ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో డ‌బ్బుల మూట‌లు రంగ‌ప్ర‌వేశం చేశాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్త‌గా ఓ ప‌ర్యాయం ఎన్నిక‌ను ర‌ద్దు చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం... గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితిలో మొన్న మ‌రోమారు షెడ్యూల్ విడుద‌ల చేసి ఎలాగోలా ఎన్నిక‌ను పూర్తి చేసింది.

ఈ ఎన్నిక‌ల్లో అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దిన‌క‌ర‌న్ బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌తంలో జ‌య‌కు వ‌చ్చిన మెజారిటీ కంటే కూడా దిన‌క‌ర‌న్ అధిక మెజారిటీ సాధించేసి స‌త్తా చాటారు. అయితే ఈ స‌త్తా వెనుక ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వ‌మేమీ లేద‌ని - గుట్టుగా ఆయ‌న పంచిన డ‌బ్బుల క‌ట్ట‌లేన‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయితే దీనికి సంబంధించి సింగిల్ ఆధారం కూడా దొర‌క‌క‌పోవ‌డంతో ఈసీ కూడా దిన‌క‌ర‌న్‌ ను అడ్డుకోలేక‌పోయింది. అయితే తాను చేసిన త‌ప్పును తానే చెప్పేసుకున్న చందంగా ఇప్పుడు దిన‌క‌ర‌న్ ఈసీకి అడ్డంగా బుక్క‌య్యార‌నే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకెళితే... ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన వారంతా ఈసీకి త‌మ త‌మ ఖ‌ర్చుల‌ను వెల్లడించేశారు. ఇందులో భాగంగా దిన‌క‌రన్ కూడా తాను చేసిన ఖ‌ర్చును ఈసీకి స‌మ‌ర్పించారు. అయితే ఈ లెక్క‌ల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌లుగా ఉన్నాయ‌ట‌.

మిగిలిన ఏ ఒక్క‌రి లెక్క‌ల‌పై అంత‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని ఈసీ... విజ‌యం సాధించిన దిన‌క‌ర‌న్ స‌మ‌ర్పించిన లెక్క‌ల‌పైనే అనుమానాలు వ్య‌క్తం చేసింద‌ట‌. అంతేకాకుండా ఈ లెక్క‌ల‌పై క్షేత్ర స్థాయిలో ద‌ర్యాప్తు చేయండ‌ని త‌న ప‌రిధిలోని కొంద‌రు అధికారుల బృందాన్ని చెన్నైకి పంపింంద‌ట‌. ప్ర‌స్తుతం ఈసీ పంపిన ఈ అధికారుల బృందం... ఎన్నిక‌ల సంద‌ర్భంగా దిన‌క‌ర‌న్ కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల‌పై పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నార‌ట‌. ఈ ద‌ర్యాప్తులో ఏమాత్రం తేడాలు క‌నిపించినా.... దిన‌క‌ర‌న్ క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న ఎమ్మెల్యే గిరీ క్ష‌ణాల్లో ఊడిపోవ‌డం ఖాయ‌మే. దిన‌కర‌న్ ఎమ్మెల్యే ప‌ద‌వికే ఎస‌రు తెచ్చిన‌ట్లుగా భావిస్తున్న ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు త‌మిళ‌నాడుతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. చూద్దాం... మ‌రి ఏం జ‌రుగుతుందో.