Begin typing your search above and press return to search.

ఎన్నికల సంఘం డెసిషన్ : జగన్ కి భారీ షాక్...?

By:  Tupaki Desk   |   21 Sept 2022 8:30 PM IST
ఎన్నికల సంఘం డెసిషన్ : జగన్ కి భారీ షాక్...?
X
ఏదీ శాశ్వతం కాదు, ఏదీ కూడా ఎవరి సొత్తు కాదు, ఈ సత్యం అందరికీ అర్ధమైనా రాజకీయాల్లో ఉన్న వారికి అసలు అర్ధం కాదు. ఇక జగన్ విషయంలో చూస్తే ఆయన్నే వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటిస్తూ జూలైలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ జీవించి ఉన్నంతకాలం వైసీపీకి ఆయనే ప్రెసిడెంట్. ఇక ఏ రకమైన ఎన్నికలు కూడా జరగవు అని పార్టీ వారు తెగ హుషార్ చేశారు.

అయితే ఈ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మత్రం జగన్ కి భారీ షాక్ ఇచ్చేసింది. ఇలాంటి ఎన్నికలు చెల్లనేరవని కూడా స్పష్టంగా పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తరచూ ఎన్నికలు ఒక నిర్దిష్ట వ్యవధిలో జరగాలని సూచించింది. అంతే కాదు శాశ్వత అధ్యక్షుడు కానీ శాశ్వతం అని పేర్కొనే ఏ పదవులు కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టంగా చెప్పేసింది.

వైసీపీ శాశ్వత ప్రెసిడెంట్ గా జగన్ ఎన్నిక అయినట్లుగా వచ్చిన వార్తల పట్ల ఈసీ ఇలా రియాక్ట్ అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీకి నోటీసులు జారీ చేసింది. మొత్తానికి దీంతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లుగానే భావించాలి అని అంటున్నారు. ఇవి విపరీత పోకడలు అని కూడా ఆనాడే అంతా అన్నారు.

ప్రతీ పార్టీకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి. భారత దేశాన శతాధిక వృద్ధ అయిన కాంగ్రెస్ కూడా అదే నిబంధనలను అనుసరిస్తోంది. అలాగే దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ రకంగా శాశ్వత పదవుల గురించి ఆలోచన చేయలేదు. కానీ వైసీపీ మాత్రం విచిత్రంగా ఈ ప్రతిపాదన ముందు పెట్టింది. మరి దీని మీద నాడే ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాయి. జగన్ నియంత పోకడలు పోతున్నారని ఆక్షేపించాయి. ఇపుడు ఈసీ షాక్ ఇవ్వడంతో వైసీపీ డిఫెన్స్ లో పడినట్లు అయింది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.